త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీకి రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) మాజీ నేతలు షాక్ ఇచ్చారు. జనహిత పేరుతో ఆ పార్టీతో కలిసి కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు
జనహిత పేరుతో కొత్త పార్టీ. ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు
భోపాల్, సెప్టెంబర్ 12: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీకి రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) మాజీ నేతలు షాక్ ఇచ్చారు. ఆ పార్టీతో పాటు కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు జనహిత పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 2007లో ఆర్‌ఎస్‌ఎస్‌ని వీడిన అభయ్ జైన్, మనీష్ కాలే, విశాల్ బాదల్ జనహిత వ్యవస్థాపకులు. దాదాపు 200 మంది నేతలతో ఆదివారం తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై రాష్ట్రంలోని శివరాజ్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు. తాను ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తానని, దేశంలో బీజేపీ లేదా కాంగ్రెస్ ద్వంద్వ అధికార వ్యవస్థను నిలువరిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. జనహిత ఇంకా రాజకీయ పార్టీగా నమోదు కాలేదు. అయితే ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించామని, త్వరలోనే లాంఛనాలు పూర్తవుతాయని నేతలు వివరించారు. బీజేపీ అనుబంధ ఆర్ఎస్ఎస్ మాజీ నేతలు ఇప్పుడు ఆ పార్టీపైనే పోటీ చేయడం బీజేపీకి ఎదురుదెబ్బ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మాజీ నేతలు ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేయడం ప్రజల్లో భాజపా పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని కాంగ్రెస్ నేత పీయూష్ బాబెలే అన్నారు. బీజేపీ నేతల అవినీతితో ఆ పార్టీ అనుబంధ సంఘాలు కూడా విసిగిపోయాయని అన్నారు. అయితే జనహిత ప్రభావాన్ని బీజేపీ కొట్టిపారేసింది. ప్రజాస్వామ్యంలో ఎవరి భావజాలాన్ని అనుసరించినా తప్పేమీ లేదని, తమ పని తాము చేసుకుంటూనే ఉంటామని బీజేపీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది స్పష్టం చేశారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-13T02:52:56+05:30 IST