ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో గిల్.. టాప్-10లో ముగ్గురు భారత ఆటగాళ్లు

భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆసియా కప్ 2023లో బాగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో గిల్.. టాప్-10లో ముగ్గురు భారత ఆటగాళ్లు

శుభ్‌మాన్ గిల్ కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచాడు

ODI ర్యాంకింగ్స్: భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 2023 ఆసియా కప్‌లో బాగా రాణిస్తున్నాడు. అతను రెండు అర్ధ సెంచరీలతో 154 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. దాయాది పాకిస్థాన్ పై అద్భుత సెంచరీ సాధించిన రన్ మెషీన్ విరాట్ కోహ్లి, వరుస హాఫ్ సెంచరీలతో రాణిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ రెండేసి స్థానాలు మెరుగుపరుచుకున్నారు. విరాట్ కోహ్లీ ఎనిమిదో స్థానానికి ఎగబాకగా, రోహిత్ శర్మ తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.

ఆసియా కప్ 2023: స్టేడియంలో భారత్, శ్రీలంక అభిమానుల మధ్య ఘర్షణ..!

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 863 రేటింగ్ పాయింట్లు అతని ఖాతాలో ఉన్నాయి. గిల్ 759 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా ఆటగాడు వాన్ డెర్ డస్సెన్ 745 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (739), ఇమామ్ ఉల్ హక్ (735) ఉన్నారు.

ఐసీసీ ర్యాంకింగ్స్.. వన్డేల్లో బ్యాటర్ల ర్యాంకింగ్స్ ఇవే..

1. బాబర్ ఆజం (పాకిస్తాన్) – 863
2. సుభమన్ గిల్ (భారతదేశం) – 759
3. వాన్ డెర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా) – 745
4. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 739
5. ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్) – 735
6. హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) – 726
7. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) – 721
8. విరాట్ కోహ్లీ (భారత్) -715
9. రోహిత్ శర్మ (భారతదేశం) – 707
10. ఫఖర్ జమాన్ (పాకిస్తాన్) – 705

ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఆసియాకప్‌లో వికెట్ల పంట పండిస్తున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు స్థానాలు మెరుగుపడి ఏడో స్థానానికి చేరుకున్నాడు. పేసర్ సిరాజ్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఆల్ రౌండర్ల జాబితాలో నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు.

రోహిత్ శర్మ: రోహిత్ శర్మ అరుదైన ఘనత..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *