తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలు శుభవార్తలను అందించిన గులాబీ బాస్.. తాజాగా విద్యార్థులకు దసరా కానుకను…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలు శుభవార్తలను అందించిన గులాబీ బాస్ తాజాగా విద్యార్థులకు దసరా కానుకను ప్రకటించారు. తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది.
మరి టిఫిన్..!
ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10వ తరగతి వరకు) చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘సీఎం అల్పాహార పథకం’ పేరుతో అల్పాహారం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం దసరా రోజు అంటే అక్టోబర్-24 నుంచి ప్రారంభం కానుంది. స్కూల్ వర్కింగ్ డేస్ లో మాత్రమే ఉదయం టిఫిన్ అందిస్తారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి రూ. 400 కోట్ల అదనపు భారం పడుతుందని కేసీఆర్ సర్కార్ చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే.
అక్కడి నుంచి ఇక్కడికి..!
ఉదయాన్నే వ్యవసాయం, కూలీ పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకున్న ప్రభుత్వం మానవతా దృక్పథానికి అద్దం పడుతోందని బీఆర్ ఎస్ శ్రేణులు అంటున్నారు. ఈ అల్పాహార పథకాన్ని తమిళనాడులో స్టాలిన్ సర్కార్ అమలు చేస్తుండగా.. ఐఏఎస్ అధికారుల బృందం వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించి కేసీఆర్‌కు నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించిన కేసీఆర్ ఎట్టకేలకు తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-15T21:36:11+05:30 IST