గాయం కారణంగా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఆసియా కప్ ఫైనల్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. బీసీసీఐ అధికారులు వాషింగ్టన్ సుందర్‌ను శ్రీలంకకు పిలిపించినట్లు వార్తలు వచ్చాయి.
ఆదివారం కొలంబో వేదికగా టీమిండియా-శ్రీలంక మధ్య ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఫైనల్ కు ముందు టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఫైనల్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధికారులు వాషింగ్టన్ సుందర్‌ను శ్రీలంకకు పిలిపించినట్లు వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. మొదట ఫీల్డర్ విసిరిన బంతికి కుడి చేతి వేలికి గాయమైంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను గెలిపించేందుకు అక్షర్ పటేల్ శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ 42 పరుగులు చేసి చివరి ఓవర్‌లో ఔటవడంతో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది.
అయితే ఫైనల్‌లో అక్షర్ పటేల్ ఆడతాడో లేదో చెప్పలేమని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ఈ విషయం మ్యాచ్ కంటే ముందే తెలుస్తుందని స్పష్టం చేశారు. అక్షర్ పటేల్ గైర్హాజరైతే.. మరో స్పిన్ ఆల్ రౌండర్ జట్టులో లేకపోవడంతో వాషింగ్టన్ సుందర్‌ను ముందుగానే పిలిచినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ శ్రీలంక వెళ్లినా.. అక్షర్ పటేల్ కు బదులుగా తుది జట్టులో చోటు దక్కించుకోవడం అనుమానమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకున్న అక్షర్ పటేల్ గాయం తీవ్రం కాకుండా ఉండాలంటే విశ్రాంతి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: వాటర్ బాయ్: విరాట్.. వాటర్ బాయ్
కాగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తోంది. ఫలితంగా గత మూడు మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు వికెట్లు పడగొట్టారు. పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌ల్లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెలరేగిపోయాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాల కూడా 5 వికెట్లతో రాణించాడు. టీమ్ ఇండియాపై బంగ్లాదేశ్ స్పిన్నర్లు కూడా విఫలమయ్యారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్ మ్యాచ్ లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో బ్యాకప్ గా ఎవరికి చోటు దక్కుతుందో వేచి చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2023-09-16T15:41:22+05:30 IST