బళ్లారి: చంద్రబాబుకు మద్దతుగా పెద్దఎత్తున నిరసనలు

– వలస మహిళలు, విద్యార్థులు, యువత, రైతులు, వ్యాపారులు

– బళ్లారి దుర్గామాత ఆలయంలో పూజలు

బళ్లారి (బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై బళ్లారిలో నిరసనలు, ర్యాలీలు జరిగాయి. మహిళలు, యువకులు, వ్యాపారులు, రైతులు, విద్యావంతులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చంద్రబాబుకు అండగా నిలిచారు. ఆదివారం ఉదయం బళ్లారి దుర్గామాత ఆలయంలో 108 టెంకలు కొట్టి పూజలు, పూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది ర్యాలీగా రాయల్‌ సర్కిల్‌కు చేరుకుని మానవహారం నిర్వహించారు. సైకో జగన్ పోవాలి, సైకిల్ రావాలి, రాక్షసుడు పోవాలి, రామరాజ్యం రావాలి.. అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దాదాపు గంటపాటు ఇక్కడే ఉన్నారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, సైకో జగన్ వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని మండిపడ్డారు.

దుర్గమ్మగుడి నుంచి ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది చంద్రబాబు, టీడీపీ అభిమానులు, కమ్మ సంఘాల ప్రతినిధులు, తెలుగు సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు పసుపు కండువాలు కప్పుకుని ‘ఐ యామ్ విత్ సీబీఎన్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గతంలో ఎన్నడూ నిరసనలు, ర్యాలీల్లో పాల్గొనని మహిళలు కూడా భారీగా తరలివచ్చారు. ర్యాలీలో వివిధ సంఘాల నాయకులు గుర్రం లాల్ మోహన్, జాగరాల దామోదర్ చౌదరి, కోనంకి రామప్పచౌదరి, తిమ్మరాజు, ప్రభాకర్నాయుడు, మాజీ మేయర్ రాజేశ్వరి, సుబ్బరాయుడు, విక్కీ, రామాంజనేయులు, కోణంకి తిలక్, బాలాజీ శ్రీనివాస్, రామాంజనేయులు, శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, జెవి. ఈశ్వరయ్య, సూరి, విజ్జీ , మల్లికార్జున, ధనుంజయ, చంద్రశేఖర్, అమర్‌నాథ్ చౌదరి సురేష్, రఘు, శేఖర్, సాయిబాలాజీ, లక్ష్మీవరప్రసాద్, సునీల్ చౌదరి, సుధాకర్, నరేష్, శ్రీనివాసులు, సందీప్, యుగంధర్, బాబు, కిరణ్, ఎర్రిస్వామి, రజనీ, రమాప్రభ, సురేష్ నందమూరి తారక రామారావు, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *