ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: పాయింట్లు సమానం.. కానీ పాకిస్థాన్ నంబర్ వన్ జట్టు

ఐసీసీ ఇటీవల వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఆసియా కప్ గెలిచిన టీమ్ ఇండియా సత్తా చాటుతుందని అందరూ అంచనా వేశారు. అయితే అనూహ్యంగా పాకిస్థాన్ జట్టు నంబర్ వన్ జట్టుగా నిలిచింది. టీమ్ ఇండియా, పాక్ ఖాతాల్లో 115 పాయింట్లు ఉన్నప్పటికీ.. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన టీమిండియా రెండో స్థానంలో కొనసాగాల్సి వచ్చింది. ఈ నెల 22 నుంచి సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్ విజయం సాధిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ జట్టుగా రికార్డు సాధిస్తుంది. ప్రస్తుతం టెస్టులు, టీ20ల్లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. టెస్టుల్లో 264 పాయింట్లు, టీ20ల్లో 118 పాయింట్లతో భారత్ నంబర్ వన్ జట్టుగా నిలిచింది.

మరోవైపు వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియాకు రేటింగ్ పాయింట్లు పడిపోయాయి. దీంతో ఆ జట్టు 113 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. టీమిండియాతో వన్డే సిరీస్ గెలిస్తే ఆస్ట్రేలియా కూడా టాప్ ర్యాంక్ చేరుకునే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా 106 పాయింట్లతో నాలుగో స్థానంలో, ఇంగ్లండ్ 105 పాయింట్లతో ఐదో స్థానంలో, న్యూజిలాండ్ 100 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో న్యూజిలాండ్ ర్యాంకుల్లో పడిపోయింది. h

ఇది కూడా చదవండి: టీమ్ ఇండియా: టీమ్ ఇండియాపై పాక్ దిగ్గజం.. వరల్డ్ కప్ కూడా గెలుస్తుందా..!!

పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ (863 పాయింట్లు) బ్యాటింగ్ ర్యాంక్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ 759 పాయింట్లతో రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ వాండర్ డస్సెన్ 745 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. బౌలర్ల ర్యాంక్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్ 692 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ రెండో స్థానంలో నిలిచాడు. టాప్-10లో భారత్ నుంచి కుల్దీప్ ఒక్కడే ఉన్నాడు. 656 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు వన్డే ఆల్ రౌండర్ ర్యాంకుల్లో బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబుల్ హసన్ టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *