చంద్రబాబు అరెస్ట్: చంద్రబాబు అరెస్ట్.. పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం

చంద్రబాబు అరెస్ట్: చంద్రబాబు అరెస్ట్.. పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం

గల్లా జయదేవ్ ఆరోపణలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ ఇష్యూ

చంద్రబాబు అరెస్ట్: చంద్రబాబు అరెస్ట్.. పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం

చంద్రబాబు అరెస్ట్ ఇష్యూ

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం: చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ, టీడీపీ నేతల మధ్య పార్లమెంట్ లో మాటల యుద్ధం జరిగింది. గల్లా జయదేవ్, మిథున్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఏపీలో చట్టాలు ఉల్లంఘించారని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని గల్లా జయదేవ్ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఇది కూడా చదవండి..బ్రహ్మణి నారా : చంద్రబాబు అరెస్ట్‌తో నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి..? పార్టీ కష్టాల్లో ఉన్నందున బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు

గల్లా జయదేవ్ ఆరోపణలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. రూ.371 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఆధారాలతో సహా చంద్రబాబును అరెస్ట్ చేశామని, ఇందులో ఎలాంటి అక్రమం లేదని, రాజకీయ కక్షల ప్రమేయం లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. సభలో ఇరు పార్టీల ఎంపీల మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. కాగా, కోర్టు పరిధిలోని అంశాలపై పార్లమెంట్‌లో మాట్లాడటం సరికాదని ప్యానెల్‌ స్పీకర్‌ ఇరువురితో అన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కాగా, చంద్రబాబు అరెస్ట్ కేసు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించింది. రాజకీయ వేడి పెరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. చంద్రబాబు స్కాం చేశారని, ఆధారాలతో సహా అరెస్ట్ చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు నారా లోకేష్ దీనిపై జాతీయ స్థాయిలో మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇది కూడా చదవండి..టీడీపీ: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్లు దొరికారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *