ఈరోజు కొత్త పార్లమెంటు భవనంలో కొత్త భవిష్యత్తును ప్రారంభిస్తామని, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో కొత్త భవనంలోకి ప్రవేశిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ కొత్త భవనంలోకి ప్రవేశించేందుకు ఎంపీలంతా మంగళవారం సెంట్రల్ హాల్‌లో సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: ఈరోజు కొత్త పార్లమెంటు భవనంలో కొత్త భవిష్యత్తును ప్రారంభిస్తామని, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో కొత్త భవనంలోకి ప్రవేశిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ కొత్త భవనంలోకి ప్రవేశించేందుకు ఎంపీలంతా మంగళవారం సెంట్రల్ హాల్‌లో సమావేశమయ్యారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని ఉద్వేగానికి లోనయ్యారు. గత 71 ఏళ్లలో అనేక ప్రభుత్వాలు ఇక్కడ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాయని గుర్తు చేశారు. పార్లమెంటు సభ్యులకు, దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.
1952 నుంచి ఇప్పటి వరకు 41 మంది ప్రభుత్వాధినేతలు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రసంగించారని, 86 సార్లు రాష్ట్రపతి ప్రసంగాలు చేశారని, దాదాపు 4 వేల చట్టాలు ఇక్కడే చేశారని మోదీ చెప్పారు. ట్రిపుల్ తలాక్, ట్రాన్స్‌జెండర్ల చట్టాలకు ఈ పార్లమెంట్‌లోనే ఆమోదం లభించింది. ఆర్టికల్ 370 రద్దు ఇక్కడే జరిగిందని అన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోందన్నారు. భారతదేశ అభివృద్ధే ధ్యేయంగా, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనే దృఢ సంకల్పంతో కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెడుతున్నామని చెప్పారు. కొత్త శక్తి, సంకల్పంతో కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. మనందరం విజ్ఞానం, ఆవిష్కరణలపై దృష్టి సారించాలని అన్నారు. చంద్రయాన్-3 విజయం తర్వాత యువత సైన్స్ అండ్ టెక్నాలజీపై మక్కువ చూపుతున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ప్రధాని సూచించారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-19T14:36:34+05:30 IST