రజాకార్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూసిన చాలా మంది రెండు రకాలుగా ఫిదా అయ్యారు. మత విద్వేషాలు పెంచే ప్రయత్నమని ఒకరు విమర్శిస్తుంటే.. నిజాలు మాట్లాడటంలో తప్పేమీ లేదని మరొకరు వాదిస్తున్నారు. ఈ సినిమా వివాదంలోకి రాజకీయాలు కూడా వచ్చాయి. అసలు రాజకీయాల కోసమే ఈ సినిమా తీశారు. రాజకీయాలు లేకుండా ఎలా ఉంటుంది. చరిత్ర తెలియని మూర్ఖులు మత విద్వేషం కోసం ఈ సినిమా తీశారని.. అడ్డుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహజంగానే బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నిజం చెబితే బాధ ఏంటి?
రజాకార్ సినిమా కచ్చితంగా వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా కాశ్మీర్ ఫైల్స్.. కేరళ ఫైల్స్ తరహాలో ఉంటుంది. బీజేపీ నేత గూడూరు నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలోని రజాకార్ల దురాగతాల గురించి తెలియని ఎన్నో విషయాలను ఈ చిత్ర కథలో చిత్రీకరిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో పారామిలటరీ వాలంటీర్ దళాన్ని రజాకార్లు అని పిలిచేవారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఖాసిం రజ్వీ నాయకత్వంలో వాటి విస్తరణ జరిగింది. హైదరాబాదులో ముస్లింల పాలనను కొనసాగించడానికి భారతదేశ విలీనానికి వ్యతిరేకంగా వారు ప్రతిఘటించారు మరియు పోరాడారు. అయితే ఆ సమయంలో వారు ముస్లింలతో పాటు హిందువులను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని చెబుతున్నారు. అయితే ట్రైలర్ మొత్తం హిందువులను చంపేసేలా ఉంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయి. ఇదీ వివాదం.
‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ వంటి చిత్రాలు ఒక వర్గాన్ని బూచిగా, ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నాయని విమర్శించారు. ఇప్పుడు రజాకార్లపై తెలంగాణ సినిమాలో అలాంటి ప్రయత్నమే మరొకటి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణా సమాజం చాలా డైనమిక్‌గా ఉంది మరియు పోరాటాల ద్వారానే ఉన్నందున, వారు ఏది మంచి మరియు చెడు ఏది సులభంగా గుర్తించగలరు. ఈ సినిమా తెర వెనుక రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.