మహిళా రిజర్వేషన్ బిల్లు: మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకం..

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-09-19T15:41:42+05:30 IST

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కేంద్రం నారీ శక్తి వందన్ అభియాన్ అని పేరు పెట్టింది. కానీ 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్టసభల్లో మహిళా సభ్యుల సంఖ్య 180కి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకత.

మహిళా రిజర్వేషన్ బిల్లు: మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకం..

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కేంద్రం నారీ శక్తి వందన్ అభియాన్ అని పేరు పెట్టింది. కానీ 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్టసభల్లో మహిళా సభ్యుల సంఖ్య 180కి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకతలేంటో చూద్దాం..

1) చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ తప్పనిసరి చేసింది ఈ బిల్లు. తాజా సవరణ ప్రకారం లోక్‌సభ సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయబడుతుంది. దీంతో చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుంది.

2) బిల్లులోని నిబంధనలు జాతీయ రాజధాని ఢిల్లీ శాసనసభకు వర్తిస్తాయి. ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయబడింది. నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

3) ఈ బిల్లు ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల శాసన సభలకు వర్తిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల రిజర్వేషన్లతో పాటు మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి.

4) రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో 128వ సవరణ తర్వాత జనాభా లెక్కలు ప్రారంభిస్తామని కేంద్ర పెద్దలు చెబుతున్నారు. జనాభా లెక్కల తర్వాత 2027 తర్వాత బిల్లు చట్టం రూపంలోకి వస్తుందని స్పష్టం చేశారు.

నవీకరించబడిన తేదీ – 2023-09-19T15:41:42+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *