మహిళా రిజర్వేషన్ బిల్లు పవిత్ర కార్యాన్ని అమలు చేసేందుకు దేవుడు తనను ఎన్నుకున్నాడని ప్రధాని మోదీ అన్నారు. మహిళా బిల్లు భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు మోదీ విజ్ఞప్తి
ఈ పవిత్ర కార్యం కోసం దేవుడు నన్ను ఎన్నుకున్నాడని నొక్కి చెప్పండి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: మహిళా రిజర్వేషన్ బిల్లు పవిత్ర కార్యాన్ని అమలు చేసేందుకు దేవుడు తనను ఎన్నుకున్నాడని ప్రధాని మోదీ అన్నారు. మహిళా బిల్లు భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడమే ‘నారీ శక్తి వందన్ అధినియం’ మహిళా రిజర్వేషన్ బిల్లు ఉద్దేశమని ఆయన ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించేందుకు సహకరించాలని లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు మోదీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారిగా లోక్‌సభలో మోదీ ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చుతుందని దేశంలోని తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలకు భరోసా ఇస్తున్నానని, వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా విధాన నిర్ణయాల్లో వారి సహకారం ఎంతో అవసరమన్నారు. 1996లో తొలిసారిగా మహిళా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టినప్పటి నుంచి బిల్లు చుట్టూ అనేక వాదోపవాదాలు, చర్చలు జరిగాయని గుర్తు చేశారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మార్చేందుకు కృషి చేశారని, అయితే అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో సాధ్యం కాలేదని వివరించారు. ఈ బిల్లుకు సోమవారం కేబినెట్ ఆమోదం తెలిపిందని గుర్తు చేస్తూ.. సెప్టెంబర్ 19 చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-20T04:15:27+05:30 IST