ఏపీ అసెంబ్లీలో సమావేశాలు మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం వంటి సన్నివేశాలతో సినిమాని తలపిస్తాయి. ఒక ఎమ్మెల్యే మీసాలు తిప్పితే, మరో ఎమ్మెల్యే తొడ కొట్టారు. చూద్దాం చూద్దాం అంటూ సవాళ్లు విసిరారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొంత కాలంగా టీడీపీ వర్సెస్ వైసీపీ అంటూ హోరాహోరీగా సాగుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు అంటూ సభ హోరెత్తింది. మరీ ముఖ్యంగా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, దీనిపై చర్చించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.
దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం తారాస్థాయికి వెళ్లింది. టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యే సభ కొనసాగుతుండగా ఎమ్మెల్యే బాలకృష్ణ మీసాలు తిప్పారు. దీనిపై మంత్రి మండిపడ్డారు. అసెంబ్లీలో కాకుండా సినిమాల్లో మీసాలు తిప్పాలి అంటూ ఎదురుదాడికి దిగారు. చూద్దాం అంటూ బాలకృష్ణకు అంబటి సవాల్ విసిరడంతో సభ మరింత వాడివేడిగా మారింది. బాలకృష్ణ మాటలను తిప్పికొడుతూ…బాలకృష్ణను చూసి వైసీపీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి సవాల్ విసిరారు.
ఏపీ అసెంబ్లీ: అసెంబ్లీలో మీసాలు తిప్పిన బాలకృష్ణ.. మంత్రి అంబటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
సభలో బాలకృష్ణ వ్యవహారంపై వైసీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం టీడీఎల్పీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టుపై చర్చకు పట్టుబట్టి టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. స్పీకర్ పేపర్లు విసిరి నిరసన తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల తీరుతో సభలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయని మంత్రి అంబటి మాట్లాడుతుండగా.. ‘చూద్దాం రండి’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేత్తో సైగ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.
బాలకృష్ణ మీసాలు తిప్పుతూ రెచ్చగొడుతున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో మీసాలు తిప్పండి.. ఇక్కడ కాదు’’ అంటూ బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సభలో తొడ కొట్టారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.