రాజ్యాంగం: సోషలిస్టు, సెక్యులర్ పదాలు పోయాయి!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-09-21T02:41:47+05:30 IST

పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు ఇచ్చిన రాజ్యాంగ కాపీలలో సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలను తొలగించడం వివాదాస్పదమైంది.

రాజ్యాంగం: సోషలిస్టు, సెక్యులర్ పదాలు పోయాయి!

ఎంపీలకు కేంద్రం ఇచ్చిన రాజ్యాంగం కాపీ పీఠికలోని ఈ పదాల తొలగింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు ఇచ్చిన రాజ్యాంగ కాపీలలో సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలను తొలగించడం వివాదాస్పదమైంది. ఈ పదాలు తమకు ఇచ్చిన రాజ్యాంగ కాపీల పీఠికలో లేవని కాంగ్రెస్ లోక్‌సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి బుధవారం వెల్లడించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, ఇది బీజేపీ ప్రభుత్వ దురుద్దేశాలను తెలియజేస్తోందని విమర్శించారు. ఈ అంశంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా స్పందించారు. కొత్త రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ పదాలు లేవని అన్నారు. ఈ వివాదంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందిస్తూ.. రాజ్యాంగంలోని అసలు పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు లేవని, వాటిని సవరణ ద్వారా (1976లో) చేర్చారని గుర్తు చేశారు. ఎంపీలకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లో అసలు రాజ్యాంగ పీఠిక ఉందని చెప్పారు. అయితే మంత్రి వివరణపై విపక్షాలు మండిపడ్డాయి. మీరు ఎవరికైనా రాజ్యాంగం కాపీని ఇచ్చినప్పుడు, మీరు తాజా కాపీని ఇస్తారా? పాత కాపీ ఇవ్వగలరా? వాళ్ళు అడిగెను. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో స్పందిస్తూ, ‘అసలు రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్ట్ మరియు లౌకిక పదాలు లేవని బిజెపి చెబుతోంది. అంటే రాజ్యాంగ పీఠికకు చేసిన సవరణను పార్టీ గౌరవించడం లేదు. పాత పూర్వాపరాలనే అనుసరిస్తోంది. అలాంటప్పుడు ‘ప్రజాస్వామ్య దేవాలయం’గా పేరొందిన పాత పార్లమెంటును వదిలి బీజేపీ కొత్త భవనంలోకి ఎందుకు అడుగుపెట్టింది? పాత భవనంలోనే ఎందుకు కొనసాగించలేదు? ఇదంతా బీజేపీ మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలను తొలగించి కేంద్రం నేరం చేస్తోందని సీపీఐ నేత బినోయ్ విశ్వం విమర్శించారు. ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేస్తుందని తాను ఊహించలేదని, ఈ చర్య బీజేపీ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతుందని కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్ అన్నారు. రాజ్యాంగాన్ని సవరించకుండా రాజ్యాంగ పీఠికలోని పదాలను తొలగించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

నవీకరించబడిన తేదీ – 2023-09-21T02:41:47+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *