టీడీపీని కేసుల భయం వెంటాడుతున్న తరుణంలో వైసీపీని బలోపేతం చేసి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సీఎం జగన్ మాస్టర్ ప్లాన్

సీఎం జగన్ మాస్టర్ ప్లాన్
సీఎం జగన్ మాస్టర్ ప్లాన్: 2024 ఎన్నికలకు ముందు ఏపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కేసుల చుట్టూ తిరుగుతుంటే.. మరోసారి ఎలాగైనా గెలవాలనే వ్యూహంతో అధికార పార్టీ ముందుకు సాగుతోంది. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునేందుకు అధికార పార్టీ ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తోంది? టీడీపీ కేసుల్లో ఉండగా పాజిటివ్ ఓటు పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్‌ను తగ్గించేందుకు వైసీసీ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసింది?
ఏపీలో తెలుగుదేశం పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న తరుణంలో చంద్రబాబు అరెస్ట్ ఆ పార్టీకి పెద్ద దెబ్బ. మరోవైపు లోకేశ్‌తో పాటు పలు కేసుల్లో ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. దీంతో డిఫెన్స్‌లో ఉన్న పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవైపు సెంటిమెంట్‌పై ఆశలు పెట్టుకోవడంతో పాటు కేసుల నుంచి బయటపడేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఇది కూడా చదవండి..టీడీపీ వ్యూహం: టీడీపీ ముందున్న మార్గం ఇదేనా.. వారిద్దరినీ ప్రజల్లోకి తీసుకువస్తారా?
టీడీపీని కేసుల భయం వెంటాడుతున్న తరుణంలో వైసీపీని బలోపేతం చేసి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పాజిటీవ్ ఓటింగ్ ను నమ్ముకున్న జగన్.. మరోసారి అధికారం ఇస్తారని నమ్ముతున్నారు. తన పాలనలో ప్రతి ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే వైసీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఎన్నికలకు మిగిలిన 6 నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకుని సంక్షేమ ఓటు బ్యాంకును బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చాపకింద నీరులా సైలెంట్ గా వివిధ అంశాల్లో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు జగన్.
క్షేత్రస్థాయిలో ప్రభావం చూపి పలు కారణాలతో అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను సంతృప్తి పరిచేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ ఓటు బ్యాంకుతో పకడ్బందీగా పోలింగ్ బూత్‌లలో టీడీపీ, జనసేన నేతలను ఓడించేందుకు ద్వితీయ శ్రేణి నేతల పాత్ర కీలకమని వైసీపీ నాయకత్వం గుర్తించింది. నియోజకవర్గాల స్థాయిలో చాలా చోట్ల అసంతృప్తి ఉన్నట్లు వైసీపీ నాయకత్వం గుర్తించింది.
వీరికి పార్టీ అధినేత జగన్‌తో పాటు పార్టీపై అభిమానం ఉన్నప్పటికీ పలు కారణాలతో అగ్రనేతలతో విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలను చక్కదిద్దుకుని పార్టీ ప్రయోజనాల కోసం జగన్ కోసం పని చేసేందుకు వైసీపీ నాయకత్వం చర్యలు చేపట్టింది. ఈ దిద్దుబాటు చర్యలు ఎడతెరిపి లేకుండా సాగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే క్షేత్రస్థాయిలో తమ స్టామినా పెంచుకునే దిశగా వైసీపీ నాయకత్వం పావులు కదుపుతోంది. సెంటిమెంట్ అస్త్రాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ స్టామినా ఉపయోగపడుతుందని వైసీపీ భావిస్తోంది.
2019 ఎన్నికల్లో వైసిపి 50 శాతానికి పైగా ఓట్లు, 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగుతోంది. నాలుగేళ్లలో ఇచ్చిన హామీలను 98.5 శాతం అమలు చేస్తామన్న విషయాన్ని వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది. సంక్షేమంలో మహిళలకు అగ్రస్థానం కల్పించడంతో పాటు ప్రతి పథకంలోనూ మహిళలను లబ్ధిదారులుగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో ప్రతి ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది.
ఇది కూడా చదవండి..పవన్ కళ్యాణ్: జన సేనాని డైరెక్షన్..వచ్చే ఎన్నికలకు పవన్ కళ్యాణ్ కొత్త రూట్ మ్యాప్!
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముందస్తుకు వెళ్లేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో ఆయన పార్టీ శ్రేణులకు పదే పదే సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను జగన్ దాదాపు ఖరారు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు దిశగా సాగుతున్నప్పటికీ సీఎం జగన్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సంక్షేమ పథకాలు, సచివాలయ వ్యవస్థ, ఆర్‌బీకే కేంద్రాలు, నాడు-నేడు, ఆరోగ్య కేంద్రాలు వంటి నిర్ణయాలతో గ్రామీణ, పట్టణ ఓటర్లు ఆకట్టుకున్నారని పలు సర్వేలు తేల్చాయి.
ప్రజాప్రతినిధులతోపాటు పార్టీ కార్యకర్తలు నిత్యం ప్రజల మధ్యే ఉండాలని జగన్ ఆదేశించారు. అంతేకాదు టీడీపీ, జనసేన పొత్తును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవసరమైన చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల అనంతరం ‘పల్లెకు పోదాం’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు ఏపీ సీఎం జగన్. దీని ద్వారా ప్రతి సచివాలయంలో పథకాల లబ్ధిదారులతో పార్టీ నేతలు సంభాషించనున్నారు.
ఈ సందర్భంగా పథకాలు అందని వారికి అవకాశం కల్పించి పార్టీని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. టీడీపీ, జనసేన కలిసి జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ తెలుగుదేశం మాత్రం కేసుల చుట్టూ తిరుగుతోంది. ఈ సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లి టీడీపీ-జనసేన అనుకూల ఓట్లను తనవైపుకు మార్చుకుని ఓటు బ్యాంకును పెంచుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.