ఐసీఐసీఐ బ్యాంక్ భళా! | ఐసీఐసీఐ బ్యాంక్ భళా!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-10-22T04:33:03+05:30 IST

దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో రెండో…

ఐసీఐసీఐ బ్యాంక్ భళా!

క్యూ2 లాభంలో 36 శాతం వృద్ధి.. రూ.10,261 కోట్లుగా నమోదైంది

న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించిపోయాయి. సెప్టెంబర్‌తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికం (క్యూ2)లో బ్యాంక్ స్టాండ్‌లోన్ నికర లాభం 36 శాతం పెరిగి రూ.10,261 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి లాభం రూ.7,557.84 కోట్లు. వడ్డీ ఆదాయంలో మెరుగైన వృద్ధి మరియు మొండి బకాయిలకు తక్కువ కేటాయింపులు ఇందుకు దోహదం చేశాయి. కాగా, ఈ క్యూ2లో బ్యాంక్ ఏకీకృత నికర లాభం రూ.10,896 కోట్లుగా నమోదైంది. మరిన్ని విషయాలు..

  • గత మూడు నెలలుగా బ్యాంకు స్టాండలోన్ ఆదాయం రూ.40,697 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే కాలానికి రూ. 31,088 కోట్లు.

  • నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) ఏడాది ప్రాతిపదికన 23.8 శాతం పెరిగి రూ.18,308 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్ (NIM) 4.53 శాతానికి మెరుగుపడింది. కాగా, వడ్డీయేతర ఆదాయం 14 శాతం పెరిగి రూ.5,861 కోట్లకు చేరుకుంది.

  • సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకు మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్ ఎన్‌పిఎ) 2.48 శాతానికి తగ్గాయి. గత మూడు నెలలుగా మొండి బకాయిలతో సహా అన్ని అవసరాల కోసం చేసిన కేటాయింపు రూ.582.63 కోట్లకు తగ్గింది.

  • బ్యాంక్ అనుబంధ విభాగాలైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 22.6 శాతం వృద్ధితో రూ.244 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లాభం రూ.577 కోట్లకు తగ్గింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ లాభం 23.5 శాతం పెరిగి రూ.501 కోట్లకు చేరుకుంది.

నవీకరించబడిన తేదీ – 2023-10-22T04:33:03+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *