వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి కావాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి పండుగను నిర్వహించింది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ భగవత్ పాల్గొన్నారు.

వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి కావాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి పండుగను నిర్వహించింది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ భగవత్ పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడ్కరీ, ఫడ్నవీస్ ఇద్దరూ ఆర్‌ఎస్‌ఎస్ సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. మరోవైపు.. నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు ‘పథ సంచాలన్’ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, సంఘ్ నేతలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మోహన్ భగవత్ తొలుత ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కెబి హెగ్రేవాల్‌కు నివాళులర్పించారు.
విముక్తి.. విముక్తి!
అనంతరం ప్రసంగించారు. ‘వలసవాద మనస్తత్వం నుంచి మనం విముక్తి పొందాలి. ప్రపంచం నుండి మన దేశానికి అనుకూలమైన వాటిని మనం తీసుకోవాలి. దేశ ఉత్పత్తులను కాలానికి అనుగుణంగా రూపొందించాలి. స్వదేశీ అభివృద్ధి మార్గాన్ని అవలంబించాలి. సమాజ ఐక్యత మంత్రంతో అభివృద్ధికి సమాధానం చెప్పాలి. ఐక్యత సాధించడమే రాజ్యాంగ మార్గదర్శక సూత్రం‘ మోహన్ భగవత్ అన్నారు.
కార్యక్రమం అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడిన శంకర్ మహదేవన్.. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ సభ్యులకు మోహన్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-24T12:05:40+05:30 IST