– ఏపీ సీఎం జగన్ పోస్టర్లను దహనం చేసి నిరసన
– బెంగళూరులో పలుచోట్ల చంద్రబాబుకు సంఘీభావం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపినందుకు నిరసనగా బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని రాయచూరు, కొప్పాల, బళ్లారి తదితర జిల్లాల్లో తెలుగుదేశం అభిమానులు ఆందోళనకు దిగారు. ‘దేశం కర్రుహ రావణ దహనం… మనం చేద్దాం జగనాసుర దహనం’ అంటూ సోమవారం రాత్రి నిరసన తెలిపారు. వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌దేనని అన్నారు. జైలులో ఉన్న ఆయన ఆరోగ్యంపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు పద్మనాభనగర్‌లోని దేవెగౌడ పెట్రోల్ బంకులో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. జగన్ నిరంకుశ పాలనకు అద్దం పట్టేలా రూపొందించిన పోస్టర్లను దగ్ధం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు టిసి వెంకటేశంనాయుడు, ఎంకె హరిబాబు, జయచంద్ర, రమేష్, రవినాయుడు, భాస్కర్ నాయుడు, రాము, చం ద్రప్ప, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. బనసవాడి బూత్ గ్రౌండ్‌లో జరిగిన జగనాసుర దహన కార్యక్రమంలో ఉదయగిరి యోజకవర్గ ప్రవాసాంధ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గంగవరపు సుబ్బారావు, కుండ్ల వెంకటేశ్వర్లు, బత్తిని మల్లేశ్వరరావు, మిరియం లక్ష్మీనారాయణ, గోళ్ల కిరణ్‌కుమార్, కురుగొండ్ల దామోదర్ తదితరులు ఉన్నారు.
అంతకుముందు వీరంతా సైకోగా వెళ్లాలంటూ పోస్టర్లతో నిరసన తెలిపి అనంతరం దహనం చేశారు. బనశంకరి మూ డో స్టేజీలోని సాయి లేఅవుట్ వద్ద వడ్లమూడి దామోదర్ నాయుడు, పార్వతమ్మ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. చం ద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక మానసికంగా, వ్యవస్థాగతంగా వేధిస్తున్నారని దామోదర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ప్రవాసాంధ్రులు, ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్ దేవాంగం పాపన్న, కర్ణాటక చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు చిన్నప్ప ఆధ్వర్యంలో జగనసుర దహనం చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన సైనికులు, తెలుగుదేశం అభిమానులు, ప్రవాసాంధ్రులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వెంకటశివ, శంకర్‌రెడ్డి, నాగిరెడ్డి, మహబుబ్బాషా, అశోక్, రమణ, ఆచర్ల రవీంద్ర, ఓడీసీ బాబా పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ జయనగర్ లో సైకో పోవాలి అంటూ పోస్టర్లు దహనం చేశారు. కార్యక్రమంలో హైటెక్ రమేష్ మాట్లాడుతూ చంద్రబాబును ఇంకా ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు వీకే చౌదరి, హరిబాబు, మల్లికార్జున నాయుడు, నరేష్, వాసు, మినల్, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-25T12:44:00+05:30 IST