వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ పరాజయాల తర్వాత పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఎట్టకేలకు వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మూడో విజయం సాధించింది. టీమిండియాపై ఓటమి తర్వాత పాకిస్థాన్ హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకుంది. అయితే ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ బౌలర్లు విజృంభించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లు ఆడలేకపోయింది. చివరకు 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఇమామ్ హక్ కోసం ఫకర్ జమాన్‌ను పక్కన పెట్టడం పాకిస్తాన్‌కు మంచి విషయమే. బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌తో కలిసి తొలి వికెట్‌కు 128 పరుగులు జోడించాడు. అబ్దుల్లా షఫీక్ 69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు.
అయితే ఒక దశలో పాకిస్థాన్ ఎలాంటి వికెట్లు కోల్పోకుండానే మ్యాచ్‌లో విజయం సాధించడం ఖాయంగా కనిపించింది. కానీ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు మెహదీ హసన్ మిరాజ్ ఖాతాలోకి వెళ్లాయి. చివరకు 205 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 32.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది మూడో విజయం. నెదర్లాండ్స్ మరియు శ్రీలంకపై గెలిచిన పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్‌ను ఓడించి ఆరు పాయింట్లు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బాబర్ సేన సెమీస్‌కు చేరుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో పాటు ఇతర జట్ల ఫలితాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. 81 పరుగులు చేసిన ఫకార్ జమాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
నవీకరించబడిన తేదీ – 2023-10-31T21:16:16+05:30 IST