వన్డే ప్రపంచకప్: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-01T19:42:38+05:30 IST

ఇంగ్లండ్‌తో శనివారం జరగనున్న కీలక మ్యాచ్‌కు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ దూరమయ్యాడు. మ్యాక్స్‌వెల్ సరదాగా గోల్ఫ్ ఆడేందుకు వెళ్లి గాయపడ్డాడు.

వన్డే ప్రపంచకప్: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం

వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా తీవ్రంగా పోరాడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ రేసులోకి ప్రవేశించింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ భీకర ఫామ్ లో ఉండడం ఆసీస్ కు ప్లస్ పాయింట్. మరోవైపు ఆల్ రౌండర్ గా మాక్స్ వెల్ ప్రదర్శన జట్టుకు బోనస్. అయితే శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్ దూరమయ్యాడు. మ్యాక్స్‌వెల్ సరదాగా గోల్ఫ్ ఆడేందుకు వెళ్లి గాయపడ్డాడు. అతను గోల్ఫ్ కార్ట్ నుండి జారిపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మాక్స్‌వెల్‌ తలకు గాయమైందని, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ తప్పదు. ఎందుకంటే మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ రాణిస్తున్నాడు.

కాగా, మాక్స్‌వెల్ తలకు గాయం కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం 6 నుంచి 8 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. దీంతో ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లోనే కాకుండా నవంబర్ 7న అఫ్గానిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో కూడా మ్యాక్స్ వెల్ దూరమయ్యే అవకాశాలున్నాయి.మాక్స్ వెల్ స్థానంలో మార్కస్ స్టోయినిస్ లేదా కెమరూన్ గ్రీన్ ను ఆస్ట్రేలియా తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఒకే ఒక్క స్పిన్నర్ ఉన్నాడు. మాక్స్‌వెల్ ఆడమ్ జంపాతో కలిసి పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. ఇప్పుడు అతను లేకపోవడంతో ట్రావిస్ హెడ్ స్పిన్ బాధ్యతలను పంచుకోవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన ట్రావిస్ హెడ్.. సెంచరీతో ఆకట్టుకున్నాడు.

నవీకరించబడిన తేదీ – 2023-11-01T19:42:38+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *