ముఖేష్ అంబానీ: అంబానీకి మళ్లీ బెదిరింపులు.. తెలంగాణ వ్యక్తి అరెస్ట్

ముఖేష్ అంబానీ: అంబానీకి మళ్లీ బెదిరింపులు.. తెలంగాణ వ్యక్తి అరెస్ట్

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-04T16:18:53+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ టార్గెట్ గా బెదిరింపు మెయిల్స్ వస్తుండటం వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ముఖేష్‌ను చంపేస్తానని బెదిరించాడు. నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తి (19)గా గుర్తించారు.

ముఖేష్ అంబానీ: అంబానీకి మళ్లీ బెదిరింపులు.. తెలంగాణ వ్యక్తి అరెస్ట్

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ టార్గెట్ గా బెదిరింపు మెయిల్స్ వస్తుండటం వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ముఖేష్‌ను చంపేస్తానని బెదిరించాడు. నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తి (19)గా గుర్తించారు. ముఖేష్ అంబానీని చంపేస్తానని బెదిరింపు మెయిల్స్ పంపాడు. ముంబై పోలీసులు విచారణ ప్రారంభించి అతడిని గుర్తించి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు కోర్టు నవంబర్ 8వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

ముకేశ్ అంబానీకి వరుసగా బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపుతోంది. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. అంబానీకి అక్టోబర్ 27, 28 తేదీల్లో బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.. 27న రూ.20 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు.. మరుసటి రోజు రూ.200 కోట్లు ఇవ్వాలని హెచ్చరించారు. అక్టోబర్ 30న రూ.400 కోట్లు ఇవ్వాలని.. లేదంటే అంబానీని చంపేస్తామని బెదిరించారు. షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి మెయిల్ ఐడీ నుంచి ఈ మూడు బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 మధ్య మరో మెయిల్ కూడా దొరికింది. తమ వద్ద వేరే షూటర్లు ఉన్నారని అంబానీని కాల్చివేస్తామని బెదిరించారు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ ఐడీ సంబంధిత వ్యక్తికి చెందినదా లేక నకిలీ ఐడీతో ఈ మెయిల్స్ పంపారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా గతంలో బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీరిని టార్గెట్ చేసిన బీహార్‌కు చెందిన ఓ వ్యక్తిని గతేడాది ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ ముంబైలోని అంబానీ కుటుంబ నివాసం ‘యాంటిలియా’తో పాటు హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని పేల్చివేస్తామని నిందితులు బెదిరించారు.

నవీకరించబడిన తేదీ – 2023-11-04T16:18:56+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *