గీతా శంకరం: ప్రేమకథా విజువల్స్‌తో ‘గీతాశంకరం’ వచ్చింది..

గీతా శంకరం: ప్రేమకథా విజువల్స్‌తో ‘గీతాశంకరం’ వచ్చింది..

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-10T20:14:44+05:30 IST

గీతాశంకరం ప్రేమకథా దృశ్యకావ్యం, ఎస్‌ఎస్‌ఎమ్‌జి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ముఖేష్ గౌడ, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో వ్యాపారవేత్త కె. దేవానంద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్భంగా శుక్రవారం కంపెనీ కార్యాలయంలో విడుదల చేశారు మేకర్స్.

గీతా శంకరం: ప్రేమకథా విజువల్స్‌తో 'గీతాశంకరం' వచ్చింది..

గీతా శంకరం సినిమా హీరో మరియు హీరోయిన్

ఎస్‌ఎస్‌ఎమ్‌జి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ముఖేష్‌ గౌడ్‌, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో వ్యాపారవేత్త కె. దేవానంద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా దృశ్యకావ్యం “గీతా శంకరం`. . ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్భంగా శుక్రవారం కంపెనీ కార్యాలయంలో విడుదల చేశారు మేకర్స్.

ఈ సందర్భంగా నిర్మాత దేవానంద్ మాట్లాడుతూ.. మా అభిమాన భగవానుడు శ్రీ సెల్వ మహాగణపతి పేరిట నెలకొల్పిన మా SSMG సంస్థ పేరుతో ప్రారంభించిన ప్రతి పనిని ఆయన ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేశాం. తొలిసారి సినిమా నిర్మాణంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ కూడా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. ఇదొక మంచి ప్రేమకథా దృశ్యకావ్యం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ నెల 14 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. సినిమా తీయాలని నిర్ణయించుకున్నప్పుడు దాదాపు 20 మంది కథలు చెప్పారు. కానీ దర్శకుడు రుద్ర చెప్పిన పాయింట్ నచ్చి సినిమా స్టార్ట్ చేశాం. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఇందుకోసం యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ కృషి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. (గీతా శంకరం సినిమా ఫస్ట్ లుక్)

గీత-శంకరం-FL.jpg

నటుడు మురళీధర్ మాట్లాడుతూ.. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో కథానాయిక తండ్రిగా నటిస్తున్నాను. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర. ప్రేక్షకులందరి ఆదరణ, ప్రోత్సాహంతో ఈ ‘గీతాశంకరం సినిమా’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు రుద్ర మాట్లాడుతూ.. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత దేవానంద్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సినిమా అద్భుతంగా రావడానికి నాతో పాటు కష్టపడుతున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి కృతజ్ఞతలు. రెండేళ్లుగా ఈ కథను తెరకెక్కించాలని చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. మీడియా కూడా సపోర్ట్ చేయాలన్నారు. అందరికీ నచ్చే అంశాలతో ఈ సినిమా రూపొందుతోందని అన్నారు. అలాగే హీరో ముఖేష్ గౌడ్, హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ.. ఈ అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:

========================

*******************************************

*******************************************

****************************************

****************************************

నవీకరించబడిన తేదీ – 2023-11-10T20:14:45+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *