వన్డే ప్రపంచకప్: అధికారికం.. తొలి సెమీస్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-11T19:37:04+05:30 IST

టీమ్ ఇండియా: వన్డే ప్రపంచకప్‌లో నాలుగు సెమీస్ బెర్త్‌లు అధికారికంగా ఖరారయ్యాయి. ఇంగ్లండ్-పాకిస్థాన్ మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు చేజారిపోయాయి. దీంతో అధికారికంగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ జరగనున్న సంగతి తెలిసిందే. రెండో సెమీస్ ఈ నెల 16న కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.

వన్డే ప్రపంచకప్: అధికారికం.. తొలి సెమీస్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్

వన్డే ప్రపంచకప్‌లో నాలుగు సెమీస్ బెర్త్‌లు అధికారికంగా ఖరారయ్యాయి. ఇంగ్లండ్-పాకిస్థాన్ మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో అధికారికంగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న ముంబైలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ, టీమ్ ఇండియా టేబుల్ టాపర్‌గా నిలవగా, న్యూజిలాండ్ లీగ్ దశను నాల్గవ స్థానంతో ముగించింది. ఈ ప్రపంచకప్‌లోనూ అదే పునరావృతమైంది. కానీ ఫలితం భిన్నంగా ఉండాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. 2019లో జరిగిన తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ గెలుపొందింది.ఈ ప్రపంచకప్‌లో భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు తహతహలాడుతున్నారు.

ఇదిలా ఉంటే, 2019 వన్డే ప్రపంచకప్‌లో, లీగ్ దశలో టీమ్ ఇండియా ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కానీ ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటి వరకు ఓటమి లేకుండా దూసుకుపోతోంది. చివరి లీగ్ మ్యాచ్ ఆదివారం నెదర్లాండ్స్‌తో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా గెలిచే అవకాశం ఉంది. భారత్ గెలిచినా, గెలవకపోయినా మరోసారి టేబుల్ టాపర్లుగా లీగ్ దశలోనే ముగుస్తుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేస్తుందా లేక రెగ్యులర్ జట్టును బరిలోకి దింపుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాహుల్, బుమ్రా, సిరాజ్, జడేజాలకు విశ్రాంతినిచ్చి ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్, శార్దూల్ ఠాకూర్‌లను ఆడించనున్నట్లు తెలుస్తోంది.

మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – 2023-11-11T19:37:05+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *