రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ప్రజలకు మంచి పాలన అందించామని, తమ ప్రభుత్వం నీరు, విద్యుత్, విద్య, వైద్యం, రోడ్డు సౌకర్యం కల్పించిందన్నారు.

జైపూర్: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ప్రజలకు మంచి పాలన అందించామని, తమ ప్రభుత్వం నీరు, విద్యుత్, విద్య, వైద్యం, రోడ్డు సౌకర్యం కల్పించిందన్నారు. రాజస్థాన్‌లో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్ల పట్ల సానుభూతి చూపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మోదీ అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్లకు మద్దతిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఎందుకు రద్దు చేయలేదు? వారికి ఆ శక్తి ఉంది కదా? అంటే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడికి వచ్చి మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని గెహ్లాట్ అన్నారు.
3 రాష్ట్రాల్లో గెలుస్తాం: నితిన్ గడ్కరీ
మరోవైపు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ బీజేపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలు తప్పక గెలవాలన్నారు. మిజోరంలో తమ గెలుపు స్థానాలు పెరుగుతాయని, తెలంగాణలో గెలుస్తామని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. 20 ఏళ్లుగా శివరాజ్ సింగ్ ప్రభుత్వం చేసిన మంచి పనులు, 10 ఏళ్లలో ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనుల వల్ల మధ్యప్రదేశ్‌లోనూ విజయం సాధించడం ఖాయమని గడ్కరీ జోస్యం చెప్పారు.
నవీకరించబడిన తేదీ – 2023-11-14T17:43:21+05:30 IST