గుంటూరు కారం: మహేష్ బాబు, గురూజీ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారం. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఆయన, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మాటల మాంత్రికుడు మహేష్ ఇప్పుడు మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందుతున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా గుంటూరు కారం సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ధమ్ మసాలా పాటను విడుదల చేయగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలోని రెండో పాటకు సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది.
నిర్మాత నాగవంశీ గుంటూరు కారం సినిమా నుండి అద్భుతమైన అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఆదికేశవ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. గుంటూరు కారం సినిమా గురించి హింట్ ఇచ్చారు. మూడు పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలిపారు. త్వరలోనే ఆ పాటల చిత్రీకరణ పూర్తవుతుంది. అనుకున్న తేదీకి సినిమా విడుదల కానుంది. అలాగే వచ్చే వారం గుంటూరు కారం సెకండ్ సింగిల్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. గుంటూరు కారం పాటలు అద్భుతంగా వచ్చాయని, వచ్చే ఏడాది అంతా గుంటూరు కారం పాటలు వినిపిస్తాయని నాగ వంశీ అన్నారు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల నటిస్తుంది. అలాగే మీనాక్షి చౌదరి మరో కథానాయికగా నటిస్తుంది. గుంటూరు కారం సినిమా జనవరి 12న విడుదల కానుంది.
పోస్ట్ గుంటూరు కారం : గుంటూరు కారం నుండి మాస్ మసాలా అప్‌డేట్ .. రెండవ సింగిల్ డేట్ ఫిక్స్ మొదట కనిపించింది ప్రైమ్9.