ప్రకాష్ రాజ్‌కు ఈడీ సమన్లు: టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసింది. ప్రణవ్ జువెలర్స్‌కు సంబంధించి రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసింది. ప్రణవ్ జువెలర్స్‌కు సంబంధించి రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకాష్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో 100 కోట్ల కుంభకోణం కారణంగా ప్రకాష్‌ను విచారించాల్సి ఉందని ఈడీ తెలిపింది. ప్రణవ్ జువెలర్స్ నుంచి తనకు వచ్చిన చెల్లింపుల వివరాలను రాబట్టాలని సమన్లు జారీ చేసింది. ఈ ప్రకటన కోసం నటుడు ప్రకాష్‌ను ఆ సంస్థ గట్టిగా ముట్టడించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ప్రకాష్ రాజ్ మాత్రం ట్వీట్లు చేస్తూ, మీడియా మీట్ లు పెట్టి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలా ప్రశ్నించినందుకే నోటీసులు ఇచ్చారనే ఆరోపణలు లేకపోలేదు.
అసలు ఏం జరిగింది..?
పోంజీ స్కీమ్ ద్వారా ప్రణవ్ జువెలర్స్ సంస్థ అధిక లాభాలు చూపి వంద కోట్లు వసూలు చేసింది. అనంతరం ప్రణవ్ జ్యువెలర్స్ బోర్డు తిరగబడింది. దీంతో కంపెనీ యజమాని మదన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో చెన్నై, పుదుచ్చేరిలోని కంపెనీల శాఖలు, యజమానులపై ఈడీ నవంబర్-20న సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో రూ.కోటిని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. జ్యూయలరీ కంపెనీ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షల నగదు, పలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ.కోటి మోసం జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సోదాల అనంతరం మదన్ పరారీలో ఉన్నాడు. అయితే ప్రకాష్ రాజ్ విచారణకు ఎప్పుడు వెళ్తాడు..? విచారణలో ఆయన ఏం చెప్పబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నవీకరించబడిన తేదీ – 2023-11-23T20:00:46+05:30 IST