కోటబొమ్మాళి పీఎస్ రివ్యూ : కోట బొమ్మాళి పీఎస్ సినిమా ఎలా ఉంది..?

కోట బొమ్మాళి పీఎస్ సినిమా ఎలా ఉంది..? ఎన్నికల వేళ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?

కోటబొమ్మాళి పీఎస్ రివ్యూ : కోట బొమ్మాళి పీఎస్ సినిమా ఎలా ఉంది..?

మేకా శ్రీకాంత్ కొత్త సినిమా కోటబొమ్మాళి పీఎస్ రివ్యూ

కోటబొమ్మాళి పీఎస్ రివ్యూ : ప్రస్తుతం చిన్న సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటున్న గీతా ఆర్ట్స్ 2 సంస్థ తాజాగా ‘కోట బొమ్మాళి పీఎస్’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టుకి రీమేక్. శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ, పవన్ తేజ్ కొణిదెల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘లింగిడి’ పాటతో ప్రేక్షకుల్లోకి వెళ్లిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తోనే సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది.

కథ విషయానికొస్తే..
ఆంధ్రప్రదేశ్‌లోని టెక్కలి ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ ఉప ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అయితే ఆ సమయంలో కోటబొమ్మాళి పీఎస్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ (శ్రీకాంత్), కొత్త కానిస్టేబుల్ రవి (రాహుల్ విజయ్), మహిళా కానిస్టేబుల్ కుమారి (శివానీ రాజశేఖర్) వాహనంపై అదుపు తప్పి ప్రమాదానికి గురవుతారు. ఆ ప్రమాదంలో మరొకరు చనిపోతారు.

టెక్కలి నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. ఇక ఈ సామాజికవర్గానికి చెందిన యువ నాయకుడు మున్నా (పవన్ తేజ్ కొణిదెల)కి శ్రీకాంత్ అండ్ కోతో ఇప్పటికే వైరం ఉంటుంది.ఈ విషయాన్ని రాజకీయం చేసి పెద్ద సమస్యగా మారుస్తాడు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపునకు ఇబ్బంది కలగకూడదని, అందుకే ముగ్గురు కానిస్టేబుళ్లపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామన్నారు. అయితే ఈ విషయాన్ని ముందే ఊహించిన శ్రీకాంత్ మిగతా ఇద్దరిని తీసుకోకుండా పారిపోతాడు.

మరియు ఈ ముగ్గురిని 48 గంటల్లో పట్టుకోవడానికి ప్రభుత్వం రజియా అలీ (వరలక్ష్మి శరత్‌కుమార్) అనే ఎస్పీని నియమించింది. ఈ వార్‌లో వరలక్ష్మి, శ్రీకాంత్ మధ్య జరిగే ఎత్తుపల్లాలు థియేటర్లలో ఏం జరుగుతుందోనని ప్రేక్షకులను టెన్షన్‌ పడేలా చేస్తుంది. మరి చివరికి ఏమైంది? మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో తెరపై చూడాలి.

సినిమా విశ్లేషణ
ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ నాయకులు చేసే పనులు, కులతత్వాన్ని ఉపయోగించి చేసే మోసాలు, మధ్యమధ్యలో పోలీసులు ఎదుర్కొనే సమస్యలను ఈ సినిమా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇలాంటి సినిమా ఈ సమయంలో ప్రజలను ఆలోచింపజేస్తుంది.

సినిమా మొత్తం ట్విస్ట్‌లు, మలుపులతో ఆసక్తికరంగా సాగింది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కోటబొమ్మాళి లోకంలో ఉండేలా చేసారు మేకర్స్. సెకండ్‌లో కొన్ని రెగ్యులర్ సెంటిమెంట్ సన్నివేశాలు మాత్రమే ప్రేక్షకులకు కాస్త బోర్‌గా అనిపిస్తాయి. అలాగే సినిమా ముగింపు తెలుగు నేటివిటీకి కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక చివర్లో కోర్టు గదిలో జరిగే డ్రామా ఉత్కంఠభరితంగా ఉంటుంది.

నటీనటుల విషయానికి వస్తే..
చాలా కాలం తర్వాత శ్రీకాంత్ ఓ బలమైన పాత్రలో కనిపిస్తున్నాడు. మొదట్లో మామూలు కానిస్టేబుల్ లా కనిపించిన శ్రీకాంత్.. సెటిల్ అయ్యి హీరోయిజం పండించే పాత్రను పోషించాడు. అలాగే ఓ తండ్రిగా తన కూతురి కోసం తల్లడిల్లుతున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తన బాడీ లాంగ్వేజ్‌తో ఆ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జీవించింది. మురళీశర్మ, పవన్ తేజ్ కొణిదెల తదితరులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు.

విశ్లేషణ..
దర్శకుడు తేజ మార్ని సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు. రీమేక్ సినిమానే అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీర్చిదిద్దిన తీరు టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక మిగిలిన సాంకేతిక అంశాలు, సంగీతం, సినిమాటోగ్రఫీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో హద్దులు దాటకుండా ఎన్నికల వేళ మంచి సందేశం ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఈ సమయంలో ప్రేక్షకులు తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఓవరాల్ గా ఈ సినిమాకు త్రీ స్టార్ రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ, రేటింగ్ అనేది ప్రేక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *