మహారాష్ట్రలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. థానే, పాల్ఘర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం, పిడుగుల కారణంగా ఓ భవనంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
ముంబై: మహారాష్ట్రలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. థానే, పాల్ఘర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం, పిడుగుల కారణంగా ఓ భవనంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. థానే జిల్లాలోని భివాండి పట్టణంలోని కల్హేర్ ప్రాంతంలోని దుర్గేట్ పార్క్ ప్రాంతంలోని భవనం ప్లాస్టిక్ పైకప్పుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి. భివాండి నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ ఆఫీసర్ సాహిబ్ ఖర్బే మాట్లాడుతూ ఈ సంఘటన ఉదయం 6:45 గంటలకు జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అయితే భవనంలోని ప్లాస్టిక్ పైకప్పు మంటలు చెలరేగిందని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. మరోవైపు వర్షాల కారణంగా పాల్ఘర్ జిల్లాలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
నవీ ముంబైలో ఆదివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం అంతా ముంబై సహా మహారాష్ట్ర అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. నీరు నిండిన గుంతలు, చదును చేయని రోడ్లు, రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. మరాఠ్వాడాతో పాటు, రాజస్థాన్‌లోని తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ ఇదే విధమైన వర్ష సూచనను జారీ చేసింది. నవంబర్ 26 నుండి 27 వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు దక్షిణ రాజస్థాన్‌లలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పర్యవేక్షణ సంస్థ తెలిపింది. కాగా, ముంబైలో కురిసిన భారీ వర్షానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
నవీకరించబడిన తేదీ – 2023-11-26T14:08:37+05:30 IST