టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. కొన్నేళ్లుగా ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. . దీంతో జస్ప్రీత్ బుమ్రా హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఒక్క పోస్ట్‌తో సమాధానం ఇచ్చాడు.
టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. కొన్నేళ్లుగా ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లో చేరడంతో బుమ్రా ఆ జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జస్ప్రీత్ బుమ్రా హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఒక్క పోస్ట్‌తో సమాధానం ఇచ్చాడు. ‘కొన్నిసార్లు మౌనమే సరైన సమాధానం’ అనే కోట్‌ను బుమ్రా పంచుకున్నాడు. అంటే వచ్చే సీజన్‌లో అతడు ముంబైలోనే కొనసాగుతాడా లేక ఇతర ఫ్రాంచైజీలకు ఆడతాడా అనేది ఆసక్తికరంగా మారింది.
మునుపెన్నడూ లేని విధంగా ట్రేడింగ్ విండోకు డిసెంబర్ 12 వరకు గడువు ఇస్తూ.. క్యాష్ డీల్ కు అవకాశం ఉండడంతో ఆయా ఫ్రాంచైజీలు భారీ ఆఫర్లతో ఆటగాళ్లను ఉర్రూతలూగిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ భవిష్యత్ కెప్టెన్సీపై ఆశలు పెట్టుకున్న జస్ప్రీత్ బుమ్రా.. హార్దిక్ పాండ్యా రాకపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తన రాకతో కెప్టెన్సీ అవకాశాలు మూసుకుపోయాయని భావించిన బుమ్రా.. ఆర్సీబీకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విట్టర్‌లో ముంబై ఇండియన్స్ పేజీలను బుమ్రా అన్‌ఫాలో చేయడం మరియు RCB పేజీని అనుసరించడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ట్రేడింగ్ విండో ద్వారా జస్ప్రీత్ బుమ్రా RCBలో చేరబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో కీలక బౌలర్ హేజిల్ వుడ్ ను ఆర్సీబీ వదిలేసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – 2023-11-28T15:15:32+05:30 IST