ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం (01/12/23) ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా మన భారత బౌలర్లు స్పిన్నర్లు.. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా..
భారత్ vs ఆస్ట్రేలియా 4వ టీ20 మ్యాచ్: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం (01/12/23) ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా మన భారత బౌలర్లు స్పిన్నర్లు చెలరేగడంతో.. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితమైంది. భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీ20 సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రింకూ సింగ్ (46) అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (37), రుతురాజ్ గైక్వాడ్ (32), జితేష్ శర్మ (35) మెరుగ్గా రాణించడంతో భారత్ అంత స్కోరు చేయగలిగింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. నిజానికి.. మొదట్లో ట్రావిస్ హెడ్ (31) చితక్కొట్టడం చూసి ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు సులువుగా గెలుస్తుందని అందరూ భావించారు.
అయితే ట్రావిస్ హెడ్ అవుటైన తర్వాత ఆస్ట్రేలియా జోరు తగ్గింది. మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో కెప్టెన్ మాథ్యూ వేడ్ (36) తనవంతు ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైంది. ఫలితంగా ఆస్ట్రేలియా 154 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు తీయగా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ తీశారు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
నవీకరించబడిన తేదీ – 2023-12-01T22:51:00+05:30 IST