టీమ్ ఇండియా: చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఇదే..!!

టీమ్ ఇండియా: చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఇదే..!!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-12-01T20:59:16+05:30 IST

టీమ్ ఇండియా: రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నా.. ప్రధాన బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 175 పరుగుల మార్క్.

టీమ్ ఇండియా: చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఇదే..!!

రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నా.. ప్రధాన బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 175 పరుగుల మార్క్. రింకూ సింగ్ (46), జైశ్వాల్ (37), జితేష్ శర్మ (35), గైక్వాడ్ (32) రాణించారు. సూర్యకుమార్ (1), శ్రేయాస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ (0) విఫలమయ్యారు. గైక్వాడ్, జైశ్వాల్‌లు తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించినా, ఆ తర్వాత వరుస విరామాల్లో టీమిండియా వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షిస్ 3 వికెట్లు తీశాడు. జాసన్ బెరాన్ డార్ఫ్, తన్వీర్ సంఘా రెండేసి వికెట్లు తీశారు. ఆరోన్ హార్డీ ఒక వికెట్ తీశాడు.

మరోవైపు నాలుగో టీ20లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 32 పరుగులు చేసి, టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రుతురాజ్ 116 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో అతని తర్వాతి స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. కేఎల్ రాహుల్ 117 ఇన్నింగ్స్‌ల్లో 4000 పరుగులు సాధించాడు. ఓవరాల్ గా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం 107 ఇన్నింగ్స్‌ల్లోనే 4000 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు.

మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – 2023-12-01T20:59:18+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *