టీమ్ ఇండియా: అంతర్జాతీయ టీ20లో టీమ్ ఇండియా ప్రపంచ రికార్డు

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-12-02T13:54:51+05:30 IST

ప్రపంచ రికార్డు: ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న టీమ్ ఇండియా.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో ప్రపంచ రికార్డు సాధించింది. రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ తక్కువ స్కోరుకే 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.

టీమ్ ఇండియా: అంతర్జాతీయ టీ20లో టీమ్ ఇండియా ప్రపంచ రికార్డు

ఐసీసీ టీ20 ర్యాంక్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న టీమిండియా.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ తక్కువ స్కోరుకే 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. దీంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ రికార్డు బద్దలైంది. టీ20ల్లో టీమిండియాకు ఇది 136వ విజయం. 2006 నుంచి ఇప్పటి వరకు భారత్ 136 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 67 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒకటి టైగా ముగియగా, మూడు మ్యాచ్‌ల్లో ఫలితం లేదు. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా విజయ శాతం 63.84.

అంతకుముందు టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు పాకిస్థాన్‌ పేరిట ఉండేది. మొత్తం 226 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 135 మ్యాచ్‌లు గెలిచింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. టీ20 ఫార్మాట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన కివీస్‌ 102 మ్యాచ్‌లు గెలిచింది. ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో నిలిచింది. ఆ జట్టు 181 మ్యాచ్‌లు ఆడి 95 విజయాలు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా 171 మ్యాచ్‌ల్లో 95 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. టాప్-5లో ఉన్న ఐదు జట్లలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా మాత్రమే టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకున్నాయి. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ప్రపంచకప్‌ను ముద్దాడలేకపోయాయి.

మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – 2023-12-02T13:54:52+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *