రష్మికపై ట్రోలింగ్ : సినిమాలో అయితే ఓకే.. డీఫ్ ఫేక్ వీడియో అయితే తప్పా!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-12-03T10:45:48+05:30 IST

ఈఐ టెక్నాలజీతో ఈ మధ్యకాలంలో డీప్‌ ఫేక్‌ వీడియోలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! దీని వల్ల సినిమా పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మొదట రష్మిక మందన్న, తర్వాత కాజోల్‌, అలియా భట్‌ ఈ సమస్యను ఎదుర్కొన్నారు రష్మిక కూడా స్పందించారు.

రష్మికపై ట్రోలింగ్ : సినిమాలో అయితే ఓకే.. డీఫ్ ఫేక్ వీడియో అయితే తప్పా!

ఈఐ టెక్నాలజీతో ఈ మధ్యకాలంలో డీప్‌ ఫేక్‌ వీడియోలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! దీని వల్ల సినిమా పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మొదట రష్మిక మందన్న, తర్వాత కాజోల్‌, అలియా భట్‌ ఈ సమస్యను ఎదుర్కొన్నారు రష్మిక కూడా స్పందించారు. ఆమెకు మద్దతుగా అమితాబ్‌ బచ్చన్‌, మృణాల్‌ ఠాకూర్‌, నాగ చైతన్య, కీర్తి సురేష్‌, చిన్నయి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చనీయమైంది. దానికి కారణం యానిమల్ చిత్రంలో రష్మిక చేసిన హాట్ సీన్స్ కారణం. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్న, అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రధారులుగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెట ఒకటో తేదిన ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్‌గా సాగే చిత్రమిది. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య హాట్ హాట్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్నల మధ్య ముద్దుల సన్నివేశాలు యువతకు కిక్కేస్తున్నాయి. ఆ సన్నివేశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. తండ్రీ కొడుకులమధ్య సాగే కథ అయినా ఇందులో ఘాటైన ప్రేమకథ కూడా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. రష్మిక, రణ్‌బీర్ కపూర్ మధ్య హాట్ సన్నివేశాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో రష్మిక మందన్నను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

కొన్ని రోజుల క్రితం డీప్‌ఫేక్‌ వీడియోతో బాధపడి, భావోద్వేగానికి గురైంది రష్మికేనా అంటూ వెటకారంగా కామెంట్లు పెడుతున్నాయి. ఈ చిత్రంలో డీప్ ఫేక్ వీడియోకు మించి ఎక్కువ మోతాదులో హాట్‌గా కనిపించిందని అంటున్నారు. ఇప్పుడు రష్మిక డీప్ ఫేక్ వీడియో చూడటం ఎందుకు యానిమల్ సినిమాకు వెళ్లి చూడండి? అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. స్క్రీన్ పై హాట్‌గా కనిపించడంలో లేని బాధ, డీప్ ఫేక్ వీడియోల వల్ల ఇబ్బంది వచ్చిందా అంటూ విమర్శల దాడి చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కొందరు రష్మికకు మద్దతుగా నిలుస్తున్నారు. ‘ఇదొక సినిమా అని, పాత్ర మేరకు హీరోయిన్ గా ఆమె అలా చేసిందని మరిచిపోవద్దు. కథలో భాగంగా మాత్రమే ఆమె అలా నటించింది. అందుకు గట్స్‌ ఉండాలి. చెత్త కామెంట్లు చేయడం మానేయండి’ అని ఎదురు కామెంట్స్ చేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలో అసభ్యంగా చూపించారని ఆమె ఎక్కడా కామెంట్ చేయలేదు. పెరుగుతున్న టెక్నాలజీని ఇలాంటి పనులకు ఉపయోగించడం కరెక్ట్ కాదని చెప్పిందంటే అంటూ వరకు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్‌పై రష్మిక ఎలా కనిపిస్తుందో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2023-12-03T12:37:51+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *