దేవర అప్‌డేట్: ఆ రెండు సినిమాలతో టీజర్!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-12-08T14:40:56+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర. వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. హాంటెడ్ కోస్టల్ ఏరియా నేపథ్యంలో ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

దేవర అప్‌డేట్: ఆ రెండు సినిమాలతో టీజర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర. వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. హాంటెడ్ కోస్టల్ ఏరియా నేపథ్యంలో ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్స్ మాత్రమే విడుదలయ్యాయి. తదుపరి అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తదుపరి అప్‌డేట్ టీజర్ అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. డిసెంబర్ 25 లేదా జనవరి 1న టీజర్‌ని విడుదల చేయనున్నట్టు ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం సాలార్, డుంకీ విడుదలయ్యే థియేటర్లలో ‘దేవర’ టీజర్ చూడొచ్చని శుక్రవారం నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో, ఫ్యాన్స్ పేజీల్లో వైరల్ అవుతోంది. ఓవర్సీస్‌లో డంకీ మూవీకి, ఇండియాలో సాలార్ సినిమాకు సూపర్ బజ్ ఉంది. ఈ సినిమాలతో ‘దేవర’ టీజర్ విడుదల చేస్తే రీచ్ బాగుంటుందని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మేకర్స్ మాట్లాడాల్సిందే! జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే అల్యూమినియం ఫ్యాక్టరీలో సైఫ్‌ అలీఖాన్‌పై ఇంట్రడక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించారు.

నవీకరించబడిన తేదీ – 2023-12-08T14:40:57+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *