మీరు ISROలో పని చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. టెక్నీషియన్-బి పోస్టుల భర్తీకి ఇస్రో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 31 (డిసెంబర్) చివరి తేదీ. ఇస్రో ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) ఈ ఖాళీలను భర్తీ చేస్తుంది.
పోస్ట్‌లు:
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) 33 పోస్టులు, టెక్నీషియన్-బి (ఎలక్ట్రికల్) 8 పోస్టులు, టెక్నీషియన్-బి (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) 9 పోస్టులు, టెక్నీషియన్-బి (ఫోటోగ్రఫీ)-2 పోస్టులు, టెక్నీషియన్-బి (డెస్క్‌టాప్) పబ్లిషింగ్ ఆపరేటర్) )-2 పోస్టులను భర్తీ చేయాలి.
వయో పరిమితి:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. వివిధ వర్గాలకు సడలింపులు ఉన్నాయి.
అర్హతలు:
టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) నుండి ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లో ITI లేదా NTC లేదా NAC పూర్తి చేసి ఉండాలి.
టెక్నీషియన్-బి (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే NCVT నుండి ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ITI/NTC/NAC చదివి ఉండాలి.
టెక్నీషియన్-బి (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) ఉద్యోగాలకు అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. NCVT నుండి ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్‌లో ITI/NTC/NAC చేసి ఉండాలి.
దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
మొదటి దశలో రాత పరీక్ష మరియు రెండవ దశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. త్వరలోనే వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్‌ఆర్‌ఎస్‌సీ ప్రకటించనుంది.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ. 21,700 నుండి రూ. 69,100 మధ్య. అలవెన్సులు అదనం.
పూర్తి వివరాల కోసం https://www.nrsc.gov.in/ పోర్టల్‌ని సందర్శించండి.