T20 World Cup 2024: రిషబ్ పంత్ వస్తే, KL రాహుల్ ఏమవుతాడు?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-12-13T18:57:22+05:30 IST

టీ20 ప్రపంచకప్ 2024: ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడనున్నాడని వార్తలు వచ్చాయి. ఒకవేళ రిషబ్ పంత్ ఐపీఎల్‌లో ఆడితే.. అతడిని టీ20 ప్రపంచకప్‌కు సెలక్టర్లు కచ్చితంగా పరిగణిస్తారు. ఇదే నిజమైతే వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన సీనియర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

T20 World Cup 2024: రిషబ్ పంత్ వస్తే, KL రాహుల్ ఏమవుతాడు?

ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడనున్నాడని వార్తలు వచ్చాయి. ఒకవేళ రిషబ్ పంత్ ఐపీఎల్‌లో ఆడితే.. అతడిని టీ20 ప్రపంచకప్‌కు సెలక్టర్లు కచ్చితంగా పరిగణిస్తారు. ఇదే నిజమైతే వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన సీనియర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయమై ఇప్పటికే టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్, సెలెక్టర్లతో కేఎల్ రాహుల్ చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం వికెట్ కీపర్ స్లాట్ కోసం టీమ్ ఇండియాలో హోరాహోరీ పోటీ నెలకొంది. ఇషాన్ కిషన్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మ. వన్డే ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లకు సెలక్టర్లు ప్రాధాన్యత ఇవ్వగా, ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికా సిరీస్‌లో జితేష్ శర్మను పరీక్షిస్తున్నారు. వన్డే సిరీస్‌లో సంజూ శాంసన్ రాణిస్తే, టీ20 ప్రపంచకప్ జట్టుకు కూడా పోటీపడతాడు. ఐపీఎల్ తర్వాత రిషబ్ పంత్ పేరు కూడా ఈ జాబితాలో చేరనుంది.

కానీ టీ20 ప్రపంచకప్‌లో ఇద్దరు వికెట్ కీపర్లు మాత్రమే జట్టులో ఉండే అవకాశం ఉంది. ఆ ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వన్డే ప్రపంచకప్ తరహాలో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ లను మాత్రమే ఎంపిక చేస్తారా లేక టీ20 ప్రపంచకప్ కు కొత్త వికెట్ కీపర్లకు అవకాశం ఇస్తారా అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. కొత్త వికెట్ కీపర్లకు అవకాశం ఇస్తే.. రిషబ్ పంత్, సంజూ శాంసన్ లను తీసుకుంటారనే వ్యాఖ్యలు పోస్ట్ అవుతున్నాయి. రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి వస్తే కేఎల్ రాహుల్ టెస్టులు, వన్డేలకే పరిమితమవుతాడని, ఇతర వికెట్ కీపర్లకు టీ20లకు అవకాశం దక్కుతుందని కొందరు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేఎల్ రాహుల్ అన్ని ఫార్మాట్లలో వికెట్ కీపర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నాడు. మిడిలార్డర్‌లో అతని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదని అతని అభిమానులు స్పష్టం చేస్తున్నారు.

మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – 2023-12-13T18:57:24+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *