IND vs SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి ముందు టీమిండియాకు భారీ షాక్..!

టీమ్ ఇండియా

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగలనుంది. స్టార్ పేసర్ మహ్మద్ షమీని ఈ సిరీస్‌కు దూరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. షమీ చీలమండ గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అతను ప్రస్తుతం గాయానికి చికిత్స పొందుతున్నాడు. అయితే, అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది.

దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన భారత ఆటగాళ్లు శుక్రవారం విమానంలో దక్షిణాఫ్రికా వెళ్లనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, హర్షిత్ రాణా శుక్రవారం దక్షిణాఫ్రికాకు వెళ్లనున్నారు. షమీ వారితో వెళ్లడం లేదు.

KKR : IPL 2024 సీజన్‌కు ముందు కోల్‌కతా కీలక నిర్ణయం.. శ్రేయాస్ అయ్యర్ జట్టు స్క్రిప్ట్‌ను మారుస్తాడా..!

ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో షమీకి చోటు దక్కలేదు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడడంతో షమీ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని షమీ రెండు చేతులా లాగేసుకున్నాడు. అద్భుత బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఏడు మ్యాచుల్లో 24 వికెట్లు తీసి ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

టీమ్ ఇండియాకు చాలా కీలకం..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25లో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం భారత్‌కు చాలా ముఖ్యం. అయితే దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఇప్పటి వరకు టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ఈ సారి అందాల ఆరబోత సిరీస్‌ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

IND-W vs ENG-W టెస్ట్: మహిళల టెస్టు క్రికెట్‌లో భారత్ చరిత్ర సృష్టించింది.. 88 ఏళ్లలో ఇదే తొలిసారి..

ఇలాంటి సమయంలో సూపర్ ఫామ్ లో ఉన్న షమీ సిరీస్ కు దూరమైనా టీమ్ ఇండియాకు తీవ్ర ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా, రెండో టెస్టు జనవరి 3 నుంచి 7 వరకు కేప్ టౌన్ వేదికగా జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *