జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్‌గా నిర్మాత బన్నీ వాస్‌ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ స్వయంగా బన్నీ వాస్‌కు నియామక ఉత్తర్వులు అందజేశారు. ప్రచార విభాగం పార్టీకి కీలకమని, ప్రచార విభాగాన్ని సమన్వయంతో నడిపించాలని ఈ సందర్భంగా బన్నీ వాస్‌కు పవన్ కల్యాణ్ సూచించారు.
పవన్ కళ్యాణ్ మరియు బన్నీ వాస్
జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్‌గా నిర్మాత బన్నీ వాస్‌ను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియమించారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ స్వయంగా బన్నీ వాస్‌కు నియామక ఉత్తర్వులు అందజేశారు. ప్రచార విభాగం పార్టీకి కీలకమని, ప్రచార విభాగాన్ని సమన్వయంతో నడిపించాలని ఈ సందర్భంగా బన్నీ వాస్‌కు పవన్ కల్యాణ్ సూచించారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా బన్నీ వాస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఇక బన్నీ వాస్ విషయానికి వస్తే.. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ కు బన్నీ వాస్ కుడి భుజం లాంటివాడు. బన్నీ వాస్ స్క్రిప్ట్ జడ్జిమెంట్‌ను అల్లు అరవింద్ బలంగా నమ్ముతున్నాడు. అందుకే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ని స్థాపించి ఆ బాధ్యతను బన్నీ వాస్‌కి అప్పగించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ద్వారా పరిశ్రమకు కొత్త నిర్మాతలను పరిచయం చేస్తూ సంస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు బన్నీ వాస్. బన్నీ వాస్ విజయవంతమైన చిత్రాల నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నాడు. మరి జనసేన పార్టీ ప్రచార విభాగం రథసారధిగా ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి:
====================
****************************************
*************************************
****************************************
*******************************************
నవీకరించబడిన తేదీ – 2023-12-14T20:28:28+05:30 IST