కరెన్సీ నగర్: డబ్బుల నేపథ్యంలో సినిమా.. ఎప్పుడు రిలీజ్?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-12-14T18:54:25+05:30 IST

డబ్బుకు సంబంధించిన నాలుగు విభిన్న కథాంశాల చుట్టూ సాగే సినిమా ‘కరెన్సీ నగర్’. ఉన్ని ఆర్ట్స్ బ్యానర్‌పై ముక్కాముల అప్పారావు, డా.కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్నారు. వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాతో యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ్, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 29న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది

కరెన్సీ నగర్: డబ్బుల నేపథ్యంలో సినిమా.. ఎప్పుడు రిలీజ్?

కరెన్సీ నగర్ సినిమా స్టిల్

డబ్బుకు సంబంధించిన నాలుగు విభిన్న కథాంశాలతో రూపొందిన చిత్రం ‘కరెన్సీ నగర్’. ఉన్ని ఆర్ట్స్ బ్యానర్‌పై ముక్కాముల అప్పారావు, డా.కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్నారు. వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాతో యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ్, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 29న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కరెన్సీ.jpg

ఆంథాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు నిర్మాతలు తెలిపారు. డబ్బు చుట్టూ తిరిగే కథాంశంతో ‘కరెన్సీ నగర్‌’ సినిమా ఉంటుంది. డబ్బుకు మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని దర్శకుడు వెన్నెల కుమార్ ఈ సినిమాలో బాగా చూపించాడు. ఈ పాయింట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని, తప్పకుండా సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. (కరెన్సీ నగర్ విడుదలకు సిద్ధంగా ఉంది)

ఇది కూడా చదవండి:

====================

****************************************

*************************************

****************************************

*******************************************

నవీకరించబడిన తేదీ – 2023-12-14T18:54:26+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *