IPL 2024: వచ్చే ఏడాది IPLకి సంబంధించి కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక ప్రధాన ప్రకటన చేసింది. ఈ ఏడాది మెగా టీ20 లీగ్ ఐపీఎల్‌కు దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ మళ్లీ జట్టులోకి రానున్నాడని, అతడిని కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు కేకేఆర్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. నితీష్ రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మెగా టీ20 లీగ్ ఐపీఎల్‌కు దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ మళ్లీ జట్టులోకి రానున్నాడని, అతడిని కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు కేకేఆర్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. నితీష్ రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఎడిషన్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం కావడం దురదృష్టకరమని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ అన్నారు. గాయం నుంచి కోలుకోవడానికి అయ్యర్ కృషి చేసిన తీరు, ఆ తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన తీరు నిజంగా ప్రశంసనీయం అని అన్నాడు. మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి తన జట్టును విజయపథంలో నడిపిస్తాడన్న నమ్మకం మాకు ఉందని కేకేఆర్ సీఈవో అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది మొత్తం ఐపీఎల్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. అతని స్థానంలో నితీష్ రాణాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కానీ అతని నాయకత్వంలో కేకేఆర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది. శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని సెప్టెంబరు-అక్టోబర్‌లో జరిగే ఆసియా కప్‌లో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లోనూ అద్భుతంగా రాణించాడు. భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం నిర్ణయించింది.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 14, 2023 | 05:14 PM