IPL 2024: IPL 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించారు.

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించారు. ఇటీవల, ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుండి ట్రేడింగ్ విండో ద్వారా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆయనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ముంబై ఇండియన్స్ తాజా నిర్ణయంతో రోహిత్ శర్మ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో రోహిత్ శర్మ ఐదుసార్లు ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచినా.. అతడిని కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించాలని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా వన్డే ప్రపంచకప్‌లోనూ టీమిండియాను రోహిత్ ఫైనల్‌కు చేర్చాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు 158 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ 87 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. ఈ జాబితాలో 67 ఓటములు మరియు 4 టైలు ఉన్నాయి. రోహిత్‌ను తప్పించడంపై ముంబై ఇండియన్స్ గ్లోబల్ పెర్ఫార్మెన్స్ హెడ్ మహేల జయవర్ధనే స్పందించారు. రోహిత్ అసాధారణ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. అతను 2013 నుండి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మంచి ప్రదర్శన చేశాడు. అతని నాయకత్వం జట్టుకు అపూర్వ విజయాన్ని అందించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్ రోహిత్. కానీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కెప్టెన్‌ని మార్చినట్లు తెలిపిన జయవర్ధనే.. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని భావిస్తున్నాడు.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 15, 2023 | 06:30 PM