జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో డీఆర్‌ఎస్ పనిచేయలేదు. కొట్టు బతికింది. ఇప్పుడు ఈ విషయం వైరల్‌గా మారింది. అంపైర్‌పైనా, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపైనా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
అసలు ఏం జరిగింది..?
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ (100; 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా, ఓపెనర్ యశస్వి జైస్వాల్ (60; 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, విలియమ్స్ చెరో రెండు వికెట్లు తీశారు. షమ్సీ, బర్గర్‌లకు తలో వికెట్ దక్కింది.
AUS vs PAK : బంతికి చిప్ పెట్టిన బీసీసీఐ..! అందుకే పాక్ ఆటగాళ్లు ఇలా..
ఆ తర్వాత 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దక్షిణాఫ్రికా జట్టు బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి సఫారీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ జితేష్ శర్మ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే బౌలర్, కీపర్, ఫీల్డర్లు ఔట్ అంటూ విజ్ఞప్తి చేశారు. అయితే.. అంపైర్ అల్లావుద్దీన్ పాలేకర్ నాటౌట్ ఇచ్చాడు.
డేవిడ్ మిల్లర్ బ్యాట్ నుండి ఒక అంచు ఉంది, కానీ DRS ప్రస్తుతం అందుబాటులో లేదు కాబట్టి అది నాటౌట్ కాలేదు. pic.twitter.com/XVQkkyqvin
— ముఫద్దల్ వోహ్రా (@mufaddal_vohra) డిసెంబర్ 14, 2023
దీంతో టీమ్ ఇండియా ఆటగాళ్లు రివ్యూ తీసుకోవాలని భావించారు. అయితే ఆ సమయంలో సాంకేతిక లోపంతో డీఆర్‌ఎస్ పనిచేయలేదు. అంపైర్ నిర్ణయంతో మిల్లర్ బయటపడ్డాడు. అంపైర్ నిర్ణయంపై రవీంద్ర జడేజాతో పాటు సూర్యకుమార్ యాదవ్, కోచ్ రాహుల్ ద్రవిడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రీప్లేలో బంతి ఎడ్జ్ పట్టినట్లు స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
IND-W vs ENG-W టెస్ట్ : దీప్తిశర్మ స్పెల్.. కుప్పకూలిన ఇంగ్లండ్.. భారత్‌కు భారీ ఆధిక్యం
కాగా, కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా జట్టు 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది.
— నిహారి కోర్మా (@NihariVsKorma) డిసెంబర్ 14, 2023