మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీకృష్ణ జన్మభూమి మందిర్ సమీపంలోని షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. న్యాయస్థానం

ముగ్గురు అడ్వకేట్ కమిషనర్ల సమక్షంలో నిర్వహణ
అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీకృష్ణ జన్మభూమి మందిర్ సమీపంలోని షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ఈ సర్వే జరగనుంది. ఇందుకోసం ముగ్గురు అడ్వకేట్లను అడ్వకేట్ కమిషనర్లుగా నియమిస్తారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 18న ప్రకటిస్తారు. ఇటీవల వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో నిర్వహించిన శాస్త్రీయ సర్వే తరహాలోనే ఈ సర్వే కూడా జరగనుంది. ఈ అంశంపై నవంబర్ 16న వాదనలు పూర్తి కాగా, న్యాయమూర్తి జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మధురలోని కత్రా కేశవదేవ్ మందిర్ వ్యవస్థాపకుడు భగవాన్ శ్రీకృష్ణ విరాజమాన్ పేరుతో హైకోర్టులో దావా వేశారు. శ్రీకృష్ణుడికి స్నేహితులమని చెప్పుకుంటున్న ఏడుగురు వ్యక్తులు ముగ్గురు లాయర్లు విష్ణుశంకర్ జైన్, ప్రభాస్ పాండే, దేవకీ నందన్ ద్వారా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని పిటిషనర్లు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు. తామరపువ్వు ఆకారంలో ఉన్న స్తంభాలు, శేషనాగు తదితర విగ్రహాలు ఉన్నాయని చెబుతారు. వాటిని గుర్తించేందుకు నిర్ణీత వ్యవధిలో శాస్త్రీయ సర్వే నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ముస్లింల గౌరవాన్ని నాశనం చేయడమే లక్ష్యం: ఒవైసీ
అలహాబాద్ హైకోర్టు తీర్పుపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ముస్లింల గౌరవాన్ని ధ్వంసం చేయడమే ఓ వర్గం లక్ష్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో ఈ విషయంలో రాజీ కుదిరినా.. పూజా మందిరం చట్టం లేదని విమర్శించారు.
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 15, 2023 | 05:15 AM