ప్రభాస్ నటిస్తున్న ‘సాలార్’ సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అగ్ర కథానాయకులు నటించే భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైన మొదటి వారంలోనే టికెట్ ధరలు పెంచేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ నటిస్తున్న ‘సాలార్’ సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అగ్ర కథానాయకులు నటించే భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైన మొదటి వారంలోనే టిక్కెట్ ధరలను పెంచేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ‘సాలార్’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు అంటే డిసెంబర్ 28 వరకు టిక్కెట్ ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.తెలంగాణలో ప్రభుత్వం పెంచడానికి అనుమతించింది. మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.65. నైజాంలో 20 థియేటర్లలో మాత్రమే అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్, నిజామాబాద్‌లో సాలార్ ప్రీమియర్ షో నిర్వహించేందుకు అనుమతి లభించింది. రెగ్యులర్ షోలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు వెసులుబాటు కల్పిస్తూ తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆరో ఆటను ప్రదర్శించవచ్చని ఆర్డర్ పేర్కొంది.
ఏపీలోనూ అనుమతి..
సాలార్ టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏపీలో రూ.40 పెంచేందుకు వెసులుబాటు కల్పించింది. పెరిగిన ధరలు సినిమా విడుదలైన పది రోజుల తర్వాత మాత్రమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, అదనపు షోలను అనుమతించలేదు.
తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతి రావడంతో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే టిక్కెట్ల విక్రయాలు ప్రారంభం కావడంతో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ దగ్గర ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున బారులు తీరారు.
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 19, 2023 | 09:27 PM