కరోనా వైరస్ దేశాన్ని మరోసారి కలవరపెడుతోంది. నిత్యం రూపాలు మారుస్తూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం కరోనా సబ్ వేరియంట్ JN.1 కారణంగా దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
కరోనా వైరస్ దేశాన్ని మరోసారి కలవరపెడుతోంది. నిత్యం రూపాలు మారుస్తూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం కరోనా సబ్ వేరియంట్ JN.1 కారణంగా దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 4 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ప్రస్తుతం 4,054 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం 3,742గా ఉన్న యాక్టివ్ కేసులు సోమవారం నాటికి 4 వేలు దాటాయి. కరోనా కారణంగా గత 24 గంటల్లో కేరళలో ఒకరు మరణించారు. మొదటిసారిగా కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 కనుగొనబడిన కేరళ, ఒకే రోజులో అత్యధికంగా 128 క్రియాశీల కేసులను నివేదించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5,33,334 మంది కరోనా కారణంగా మరణించారు. గత 24 గంటల్లో 315 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860కి చేరింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం కాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని థానేలో, నవంబర్ 30 నుండి 20 నమూనాలను పరీక్షించగా, ఐదు JN.1 కేసులు నమోదయ్యాయని ఒక అధికారి తెలిపారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. అయితే వారెవరూ ఆస్పత్రిలో చేరలేదు. ప్రస్తుతం థానేలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 28కి చేరుకుంది. వారిలో ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ఇంట్లోనే కోలుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. ఆదివారం దేశవ్యాప్తంగా 656 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు చనిపోయారు. అంతకుముందు శనివారం 752 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే ముందు జాగ్రత్తగా ఫేస్ మాస్క్‌లు ధరించాలి. భారతదేశంలో JN.1 వేరియంట్ కారణంగా ఎటువంటి క్లస్టరింగ్ కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. కేసులన్నీ తేలికపాటివేనని చెప్పారు. రోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోలుకున్నారని వారు తెలిపారు.
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 25, 2023 | 11:15 AM