స్టాక్ మార్కెట్ లో బుల్ జోష్

2023లో సూచీలు కొత్త రికార్డులు సృష్టించాయి

న్యూఢిల్లీ: ఈ ఏడాది (2023) దేశీ స్టాక్ మార్కెట్‌కు బాగానే ఉంది. ఆరంభంలో నిరుత్సాహానికి గురైన సూచీలు గత రెండు నెలల్లో రేసుగుర్రంలా పరుగులు తీశాయి. ఈ నెల 20న బీఎస్ఈ సెన్సెక్స్ 71,913 పాయింట్లకు చేరుకుని ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. అదే రోజు బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 42,648.86 పాయింట్లకు చేరుకోగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 36,483.16 పాయింట్లకు చేరుకుని సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

స్మాల్‌క్యాప్‌లలో భారీ లాభాలు

లార్జ్, మిడ్‌క్యాప్‌లతో పోలిస్తే స్మాల్‌క్యాప్ ఇండెక్స్ షేర్లు ఈ ఏడాది ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించాయి. సెన్సెక్స్ షేర్లలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై సగటున 16.87 శాతం రాబడిని పొందగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు గత ఏడాది కాలంలో తమ పెట్టుబడులపై సగటున 45.20 శాతం రాబడిని ఆర్జించారు. ఇదే కాలంలో మిడ్‌క్యాప్ షేర్లలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై సగటున 41.74 శాతం రాబడిని ఆర్జించారు.

గతేడాదితో పోలిస్తే..

గతేడాది (2022)తో పోలిస్తే ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించింది. గతేడాది సెన్సెక్స్ షేర్లు సగటున 4.44 శాతం, మిడ్ క్యాప్ షేర్లు 1.37 శాతం లాభాన్ని, స్మాల్ క్యాప్ ఇండెక్స్ షేర్లు 1.8 శాతం నష్టాన్ని నమోదు చేశాయి. ఈ ఏడాది (2023) స్మాల్, మిడ్ క్యాప్ షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారిలో ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) కావడం గమనార్హం. 2023లో మంచి లాభాలను పంచుకున్న స్మాల్ మరియు మిడ్‌క్యాప్ ఇండెక్స్ షేర్లు 2024లో కొంత మందగించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ షేర్లు ఎంఎఫ్‌లకు క్రేజ్

మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) సంస్థలు ఈ ఏడాది కొన్ని కంపెనీల షేర్లను అధికంగా కొనుగోలు చేశాయి. వ్యాపార కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో ఉండడం, ఫండమెంటల్స్ బలంగా ఉండడంతో ఫండ్ హౌస్ లు ఈ షేర్లలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ సంవత్సరం MFలు కొనుగోలు చేసిన షేర్లలో ప్రధానంగా TCS, ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, RIL, HDFC బ్యాంక్, SBI, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా (M&M), NTPC, HCL టెక్, ITC, L&T, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌యుఎల్, బజాజ్ ఫైనాన్స్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోఫోర్జ్, ఎయిర్‌టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, నెస్లే, ఫెడరల్ బ్యాంక్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్. సిప్లా, ఇండియన్ హోటల్స్, ఎంఫసిస్, TVS మోటార్స్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్, SBI లైఫ్, అబాట్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్, ఐషర్ మోటార్స్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్. చ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *