రోహిత్ శర్మ: సఫారీ గడ్డపై టీమిండియా కెప్టెన్ చెత్త రికార్డు

ABN
, ప్రచురణ తేదీ – డిసెంబర్ 26, 2023 | 09:52 PM

రోహిత్ శర్మ: దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో 9 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతను వరుసగా 14, 6, 0, 25, 11, 10, 10, 47, 5 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 14.22 మాత్రమే. దీంతో 9 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన తొలి టీమిండియా బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ ఖాతాలో చెత్త రికార్డు ఉంది.

రోహిత్ శర్మ: సఫారీ గడ్డపై టీమిండియా కెప్టెన్ చెత్త రికార్డు

వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు మైదానంలోకి అడుగుపెట్టాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ బరిలోకి దిగినప్పుడు.. భారీ స్కోరు సాధిస్తాడని అభిమానులు అంచనా వేశారు. కానీ దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో 9 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. అతను వరుసగా 14, 6, 0, 25, 11, 10, 10, 47, 5 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 14.22 మాత్రమే. దీంతో 9 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన తొలి టీమిండియా బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ ఖాతాలో చెత్త రికార్డు ఉంది.

గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే.. ఈ టెస్టులో రోహిత్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు రోహిత్ 2,097 పరుగులు చేయగా, సెంచూరియన్ టెస్టులో కోహ్లీ ఈ రికార్డును అధిగమించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ (3,987) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు లబుషానే (3,641) రెండో స్థానంలో ఉండగా.. స్టీవ్ స్మిత్ (3,223), బెన్ స్టోక్స్ (2,710), బాబర్ ఆజం (2,570), ఉస్మాన్ ఖవాజా (2,412) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 26, 2023 | 09:52 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *