టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కొన్నాళ్లుగా కెరీర్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ధావన్ తన భార్య అయేషా ముఖర్జీ నుండి విడిపోయిన తర్వాత అతని కొడుకు జోరావర్‌ను కలవలేకపోయాడు. అయితే తాజాగా శిఖర్ ధావన్ తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కొన్నాళ్లుగా కెరీర్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. పేలవమైన ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన అతను తన వ్యక్తిగత జీవితంలో భార్యకు విడాకులు ఇచ్చాడు. తన భార్య తనను మానసికంగా వేధిస్తున్నదని ఆరోపిస్తూ ధావన్ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోవడంతో కొడుకు జోరావర్‌ను కలవలేకపోతున్నాడు. అయితే తాజాగా శిఖర్ ధావన్ తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇటీవల, శిఖర్ ధావన్ కొన్నాళ్ల క్రితం తన కొడుకుతో వీడియో కాల్ ఫోటోను పోస్ట్ చేశాడు. నిన్ను చూసి ఏడుస్తున్నాను’ అని రాసుకున్నాడు. అంతేకాదు తన కొడుకును తనకు దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధావన్ ఆరోపించారు. తన కొడుకు ఏం చేసినా ఉన్నతంగా ఎదుగుతాడని.. అతడిని ఎప్పుడూ మిస్సవుతాడని ధావన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. దేవుడి దయ వల్ల మళ్లీ కలుస్తామని కొడుకుకు ధైర్యం చెప్పారు. ఇతరులు దయ, సహనం మరియు వినయంతో ఉండాలని ఆయన కోరారు. ధావన్ జాతీయ జట్టుకు దూరంగా ఉండగా, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తదుపరి ఐపీఎల్‌లోనూ ధావన్‌నే కెప్టెన్‌గా చూసే అవకాశం ఉంది.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 26, 2023 | 04:25 PM