ఇండోనేషియా సినిమాలో తెలుగు హీరో తెలుగు హీరో విశ్వ కార్తికేయ ఇండోనేషియా సినిమా srk

ప్రస్తుతం మన టాలీవుడ్ కీర్తి ప్రపంచ దేశాల్లో రెచ్చిపోతోంది. హాలీవుడ్ మేకర్స్ కూడా టాలీవుడ్ గురించి మాట్లాడుతున్నారు. మన హీరోలు, దర్శకుల పని తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి తరుణంలో మన హీరో ఇండోనేషియా ప్రాజెక్ట్ లో నటించబోతున్నాడు. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా దూసుకుపోతున్న విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ కలియుగం పట్టణంలో అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

విశ్వ కార్తికేయ టాలీవుడ్‌లో 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ ఇలా చాలా సినిమాల్లో విశ్వ నటించారు. రాజశేఖర్ గోరింటాకు, రోహిత్ జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, శ్రీకాంత్ లేత మనసులు, మోహన్ బాబు శివశంకర్, బాలయ్య బాబు అధినాయకుడు వంటి చిత్రాల్లో విశ్వ కార్తికేయ నటించారు.

జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన చిత్రాలలో మంచి నటనను కనబరిచిన విశ్వ కార్తికేయ ప్రస్తుతం కలియుగం పట్టణంలో అనే ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో విశ్వ కార్తికేయ సరసన ఆయుషి పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతలో వారిద్దరికీ ఇండోనేషియా ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చింది.

‘శూన్యమ్ చాప్టర్ 1’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హిందీ, ఇండోనేషియా నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అతీంద్రియ శక్తుల కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతోంది. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రానికి సికె గౌస్ మోడిన్ దర్శకత్వం వహించి, నిర్మిస్తున్నారు. ఉన్ని రవి (అమెరికా) కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ మరియు భాషా (ఇండోనేషియా భాష)లో విడుదల కానుంది. ఇక ఈ ఇండోనేషియా ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది.

నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 31, 2023 | 07:40 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *