క్రికెట్ టోర్నమెంట్ : ధోతీ-కుర్తా దుస్తులతో క్రికెట్.. ఎందుకో తెలుసా..?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

క్రికెట్ టోర్నమెంట్ : ధోతీ-కుర్తా దుస్తులతో క్రికెట్.. ఎందుకో తెలుసా..?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వేద పండితులు సాంప్రదాయ ధోతీ-కుర్తా దుస్తులు ధరించి క్రికెట్ ఆడుతున్నారు. సంస్కృతాన్ని ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. పాశ్చాత్య దేశాలకు పారమార్థిక ధ్యాన సాధనను అందించిన మహర్షి మహేశ్ యోగి జయంతిని పురస్కరించుకుని మహర్షి మైత్రి పేరిట ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.

శుక్రవారం భోపాల్‌లోని అంకుర్‌ మైదానంలో టోర్నీ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆటగాళ్ళు మరియు అంపైర్లు అనర్గళంగా సంస్కృతం మాట్లాడతారు. అవుట్‌లు, మిస్‌ఫీల్డ్‌లు, క్యాచ్‌లు కూడా సంస్కృత భాషలో వివరించబడ్డాయి.

చెతేశ్వర్ పుజారా: సెలక్టర్లకు పుజారా స్ట్రాంగ్ మెసేజ్..! ఇక ఎన్నుకోవాల్సిన అవసరం లేదు..!

కాగా, ఈ టోర్నీలో విజేతలను జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం అనంతరం అయోధ్యకు తీసుకెళ్తామని మహర్షి మైత్రి కమిటీ సభ్యుడు అంకుర్ పాండే తెలిపారు.

అంతేకాకుండా విజేతలకు రూ.21 వేలు నగదు ప్రోత్సాహకం, రన్నరప్‌కు రూ.11 వేలు నగదు ప్రోత్సాహకం అందజేస్తారు. ఇది నాలుగో ఎడిషన్ టోర్నీ అని, ఈ టోర్నీలో భోపాల్‌కు చెందిన నాలుగు జట్లతో కలిపి మొత్తం 12 జట్లు పాల్గొన్నాయని వివరించారు. వైదిక కుటుంబంలో సంస్కృతం, క్రీడల స్ఫూర్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని మరో నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులకు బహుమతులతో పాటు వేద పుస్తకాలు, 100 సంవత్సరాల పంచాంగం అందజేయనున్నట్లు తెలిపారు.

BBL : ఏంటి బ్రో.. ఇది బయటా..? థర్డ్ అంపైర్ తప్పు చేస్తే మరెవరో కాదు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *