భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో కొనుగోళ్లతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులు వారాంతంలో మార్కెట్ ర్యాలీకి దోహదపడ్డాయి.

సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో కొనుగోళ్లతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులు వారాంతంలో మార్కెట్ ర్యాలీకి దోహదపడ్డాయి. శుక్రవారం సెన్సెక్స్ 309 పాయింట్ల వరకు పెరిగి ఒక దశలో 72,156 వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయికి చేరుకుంది, అయితే చివరికి 178.58 పాయింట్ల లాభంతో 72,026.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 52.20 పాయింట్లు లాభపడి 21,710.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో సగం లాభపడ్డాయి.
గత నెల 29తో ముగిసిన వారానికి విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు మరో 275 కోట్ల డాలర్లు పెరిగి మొత్తం 62,320 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. అక్టోబర్ 2021లో, ఫారెక్స్ నిల్వలు 64,500 కోట్ల డాలర్ల ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
MobiKwik రూ 700 కోట్ల IPO: రెండేళ్ల క్రితం పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రతిపాదనను ఉపసంహరించుకున్న ఫిన్ టెక్ కంపెనీ మొబిక్విక్ మళ్లీ రంగం సిద్ధం చేస్తోంది. IPO కోసం ఆమోదం కోరుతూ SEBIకి ప్రిలిమినరీ డ్రాఫ్ట్ పత్రాలను సమర్పించింది. అయితే పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని రూ.700 కోట్లకు తగ్గించింది. తొలి ప్రయత్నంలో నిర్దేశించిన రూ.1,900 కోట్ల లక్ష్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇదిలా ఉండగా, ప్రభుత్వ రంగ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (IIFCL) వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో పబ్లిక్ ఇష్యూకి రావాలనుకుంటోంది.
నవీకరించబడిన తేదీ – జనవరి 06, 2024 | 01:48 AM